Thaggedhele: ‘తగ్గేదే లే’ అంటోన్న నవీన్‌ చంద్ర .. ఉత్కంఠభరిత టీజర్‌ చూశారా..! - telugu news thaggede le movie teaser naveenchandra
close
Published : 14/10/2021 23:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Thaggedhele: ‘తగ్గేదే లే’ అంటోన్న నవీన్‌ చంద్ర .. ఉత్కంఠభరిత టీజర్‌ చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి చోటా ఇదే మాట వినిపిస్తోంది. ఇదే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నవీన్‌ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేతుగుప్త, రవిశంకర్‌, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్‌ రాజు దర్శకుడు. టీజర్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఓ హత్యకి సంబంధించిన సన్నివేశాలతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. నవీన్‌ చంద్ర పోలీసు అధికారిగా కనిపించారు. ఏ డైలాగ్‌ లేకుండా కేవలం తన హావభావాలతోనే సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ పాత్రకి సంబంధించి ఆయన రెండు కోణాల్ని ఆవిష్కరించారు. మరోవైపు, హత్యలు చేసే ఓ గ్యాంగ్‌ దర్శనమిచ్చింది. రవి శంకర్, రాజా రవీంద్ర తమదైన శైలిలో అలరించారు. మరి, ఆ హత్య చేసిన గ్యాంగ్‌ని నవీన్‌ పట్టుకున్నారా? మిస్టరీని ఎలా ఛేదించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. భద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. ఈ సినిమాకి సంగీతం: చరణ్‌ అర్జున్‌, కూర్పు: గ్యారీ బి.హెచ్‌., కళ: కిరణ్‌ కుమార్‌ మన్నె.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని