logo

దృశ్య కావ్యం.. నృత్య రూపకం

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 08 Jan 2022 03:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

నగరంలో కోడిరామ్మూర్తి మైదానంలో డ్వాక్రా బజారు వేదికపై సంప్రదాయం నాట్య గురుకులం ఆధ్వర్యంలో ధర్మోరక్షతి రక్షితః తొలి కూచిపూడి నృత్య వీధి నాటకం ప్రదర్శన కనువిందు చేసింది. ప్రముఖ నర్తకి స్వాతి సోమనాథ్‌ దర్శకత్వంలో 30 మంది విద్యార్థులు నర్తించి ఆకట్టుకున్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ఇతివృత్తంతో సాగిన నాటకం ఆద్యంతం కట్టిపడేసింది. సంప్రదాయం సంచాలకులు స్వాతి సోమనాథ్‌ మాట్లాడుతూ దేశంలో ఏ శాస్త్రీయ నృత్యంలో వీధి నాటకాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ, సాయిరాం ఆర్ట్స్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని