logo

హ్యాట్రిక్‌ వీరుడు కమాలుద్దీన్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో హ్యాట్రిక్‌ వీరుడిగా కమాలుద్దీన్‌ అహ్మద్‌ నిలిచారు. మొత్తం ఏడు సార్లు పోటీలో దిగి నాలుగు సార్లు విజయం సాధించారు.

Published : 16 Apr 2024 05:01 IST

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో హ్యాట్రిక్‌ వీరుడిగా కమాలుద్దీన్‌ అహ్మద్‌ నిలిచారు. మొత్తం ఏడు సార్లు పోటీలో దిగి నాలుగు సార్లు విజయం సాధించారు. మొదటి సారి వరంగల్‌ లోక్‌సభ స్థానానికి 1980లో కాంగ్రెస్‌ (ఐ) నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్‌(యు) అభ్యర్థి టి.పురుషోత్తంరావుపై గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రెండోసారి ఇదే స్థానం నుంచి 1984లో పోటీచేసి తెదేపా అభ్యర్థి టి.కల్పనాదేవి చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ వరంగల్‌ స్థానంలో బరిలో నిలవలేదు. 1989లో హనుమకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డిపై విజయం సాధించారు. ఇదే స్థానంలో 1991లో జరిగిన ఎన్నికల్లో తెదేపాకు చెందిన వంగా సుదర్శన్‌రెడ్డిపై రెండోసారి, 1996లో తెదేపా అభ్యర్థి బస్వారెడ్డిపై మూడోసారి విజయం సాధించారు. ఇలా వరుసగా ఒకే స్థానం నుంచి మూడుసార్లు కమాలుద్దీన్‌ అహ్మద్‌ గెలిచి హ్యాట్రిక్‌ పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని