Babu Mohan: పార్టీలో అవమానాలు జరిగాయి.. ఎన్నికల్లో పోటీ చేయను: బాబూమోహన్‌

ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు భాజపా నేత బాబూమోహన్‌ తెలిపారు.

Updated : 28 Oct 2023 16:34 IST

హైదరాబాద్‌: ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు భాజపా నేత బాబూమోహన్‌ తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబూమోహన్‌ మాట్లాడారు.

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్‌ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. అర్హులకే టికెట్‌ ఇవ్వాలని భాజపా పెద్దలను కోరుతున్నా. పార్టీలో నాకు చాలా అవమానాలు జరిగాయి. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా. భాజపా జాబితాలో నా పేరు లేకపోవడంతో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నేను ఫోన్‌ చేస్తే.. కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ లిఫ్టు చేయరు. కావాలనే నన్ను పార్టీకి దూరం పెట్టారు’’ అని బాబూమోహన్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని