logo

గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధం: సీబీఐ మాజీ డైరెక్టర్

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 09 Sep 2023 16:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఆరోపించారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ(సి) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరని వెల్లడించారు. ఈ విషయంలో స్పష్టత కరవైందన్నారు. 

ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకుని ఉంటే.. ఆ పత్రాలు చూపించాల్సి ఉంటుందని నాగేశ్వరరావు తెలిపారు. గవర్నర్ అనుమతి లేకపోతే దర్యాప్తు చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే.. అక్రమ నిర్బంధం అవుతుందని తెలిపారు. ఆ చర్యకు పాల్పడిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


Tags :
Published : 09 Sep 2023 14:11 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని