panchayat elections: విధి ఓడించినా... ఓటర్లు గెలిపించారు

శంకర్పల్లి, న్యూస్‌టుడే: శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో ఆదివారం 8వ వార్డు సభ్యురాలుగా పల్లె లత(42) తన సమీప ప్రత్యర్థిపై 30 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన మాసానిగూడ అనుబంధ గ్రామం మంచర్లగూడెంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ఆమెకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అయినప్పటికీ లతను ఓటర్లు ఆదరించడం గమనార్హం. ఈ వార్డు స్థానానికి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నిక నిర్వహిస్తామని ఎంపీడీఓ వెంకయ్య తెలిపారు.
మరణించిన అభ్యర్థిని వరించిన విజయం!

రాయికోడ్, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపడ్‌పల్లిలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థినే విజయం వరించింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు సొంత పార్టీ వాళ్లే మోసం చేస్తున్నారనే ఆందోళనతో ఈ నెల 8న సర్పంచి అభ్యర్థి చాల్కి రాజు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో రాజు 9 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తాజా వార్డు సభ్యుడి ఆత్మహత్య!

కాల్వశ్రీరాంపూర్, న్యూస్‌టుడే: వార్డు సభ్యుడిగా గెలిచిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం... కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్లకు చెందిన రేవెల్లి రాజ్‌కుమార్(35) తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఆయన గతేడాదిగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఓట్ల కోసం గ్రామానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజ్‌కుమార్ ఆదివారం గ్రామంలో మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు సమాచారం. సాయంత్రానికి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతిపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

అడవిలో పులి లెక్క.. ఈ రెడ్డయ్య కుటుంబం
అడవిలో పులి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. దానికంటూ సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటుంది. తన జతను తప్ప మరో పులిని అందులోకి రానివ్వదు. -

బ్యాలెట్ బాక్సులేనా.. బనానా బాక్సుల్లేవా..
ఖమ్మం జిల్లాలో అతిపెద్ద పంచాయతీ అయిన తల్లాడలో 6,500 మంది ఓటేసేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బారులుతీరారు. -

మనసుకు బాధ కలిగి.. శుభ్రం చేసిన మొగులయ్య
ప్రముఖ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య వర్ణచిత్రాన్ని ప్రభుత్వం హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద మెట్రో పిల్లర్‌పై గీయించింది. -

4 ఓట్లతో ఓడి.. 6 తేడాతో గెలిచి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థుల్లో ఒకరు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించిన అనంతరం రీకౌంటింగ్‌లో ఫలితం మారిపోయింది. -

కాంగ్రెస్.. ‘తీన్’మార్
రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. -

ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత పిటిషన్ల కొట్టివేత
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఆయన.. -

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై బుధవారం స్పీకర్ ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ ఒక ప్రకటనలో స్పందించారు. -

ఏప్రిల్ నుంచి ‘కొత్త డిస్కం’
తెలంగాణలో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -

ప్రారంభానికి సిద్ధంగా క్రిటికల్ కేర్ విభాగాలు
రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రులకు అనుసంధానంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాకుల్లో 8 భవనాలు మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ‘గోల్డెన్ అవర్’లో మెరుగైన చికిత్స అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ యూనిట్లను నిర్మించింది. -

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గ్రామంలో భాజపా మద్దతుదారు గెలుపు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో భాజపా మద్దతుదారు గానుగపాట అంజమ్మ సర్పంచిగా గెలుపొందారు. ఈ గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. -

అదృష్టవంతులు.. ఈ సర్పంచులు
పల్లె పోరులో కొందరు సర్పంచి అభ్యర్థులను అదృష్టం వరించింది. బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో పలు చోట్ల ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా రాగా అధికారులు లక్కీ డ్రా తీశారు. -

ఒక్క ఓటుతో గెలుపు తలుపు తట్టి..
హోరాహోరీగా జరిగిన పల్లె సంగ్రామంలో ఒక్క ఓటు కొందరి తలరాతలు మార్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటింది. -

ఎన్నికల విధుల్లో ఒత్తిడికి గురై ఎంపీడీవో మృతి
ఎన్నికల విధుల్లో ఒత్తిడికి లోనైన ఎంపీడీవో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. కార్యాలయ ఉద్యోగులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. -

వామపక్షాలకు మిశ్రమ ఫలితాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వామపక్షాలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సీపీఎం మద్దతుదారులు గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 120 మందికిపైగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. -

గతం కన్నా పెరిగిన భాజపా బలం
గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని గతంలో కన్నా పెంచుకుంది. మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచిన స్థానాల సంఖ్య 700 దాటింది. -

భారత రాష్ట్ర సమితికి నూతనోత్సాహం
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు భారాసకు నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన పలు ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణులు నిరాశగా ఉన్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆనందాన్ని కలిగించింది. -

చేయి పట్టుకున్న పల్లె..!
పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణుల మద్దతు లభించిందని కాంగ్రెస్ వర్గాల్లో జోష్ పెరిగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పార్టీకి ఇప్పుడు ప్రజల మద్దతు మరింత పెరిగినందునే అత్యధిక స్థానాలు నెగ్గినట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు. -

కాంగ్రెస్ పతనం ప్రారంభం
రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -

మా పాలనపై విశ్వాసానికి ఈ ఫలితాలే ప్రతిబింబం
అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘనవిజయం సాధించడం గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై వ్యక్తం చేసిన విశ్వాసానికి ప్రతిబింబమని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. -

మంచి పేరు తెచ్చుకోండి.. నాకూ కొంత పంచండి
‘ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు.. నిత్యం వారి కోసం పనిచేయండి.. గ్రామాలను అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుని అందులో నాకూ కొంత పంచండి’ అంటూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితబోధ చేశారు.







