Telangana News: మద్యం మత్తులో మంచినీళ్లు అనుకొని యాసిడ్‌ కలుపుకొని తాగి వ్యక్తి మృతి

Eenadu icon
By Crime News Team Updated : 17 Aug 2022 15:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

హాజీపూర్, న్యూస్‌టుడే: మద్యం మత్తులో నీళ్లు అనుకొని యాసిడ్‌ను కలుపుకొని తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం ముల్కల్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్‌(29) సింగరేణిలో ఉద్యోగం చేస్తాడు. గత నెల 18న మద్యం మత్తులో మంచినీరు అనుకొని యాసిడ్‌బాటిల్‌లోని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతను ఈ రోజు మృతిచెందినట్లు హాజీపూర్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. మహేశ్‌కు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
Published : 09 May 2022 02:07 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని