హిరోషిమాలో ఒబామా నివాళి
close

తాజావార్తలు

హిరోషిమాలో ఒబామా నివాళి
హిరోషిమా: జపాన్‌లోని హిరోషిమా పీస్‌ మెమోరియల్‌ పార్క్‌ను శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబేతో కలిసి సందర్శించారు. హిరోషిమాపై జరిగిన అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. జపాన్‌లో జరుగుతున్న రెండు రోజుల జీ-7 సదస్సుకు ఆయన హాజరయ్యారు. దాదాపు ఏడు శతాబ్దాల తర్వాత మొదటి అణుబాంబు దాడి ప్రాంతాన్ని పరిశీలించారు. అణుబాంబు దాడి ప్రాంతాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. ఈ సందర్భంగా అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన వారిని ఆయన కలిశారు.
ఒబామా పర్యటన సందర్భంగా పరిసర ప్రాంతాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగింది. ఈ దాడిలో వేలాది ప్రజలు ప్రాణాలు కోల్పోగా దాని ప్రభావం కొన్ని ఏళ్ల పాటు ఉంది. హిరోషిమాపై దాడి జరిగిన మూడు రోజుల వ్యవధిలోనే నాగసాకిపై బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.