- TRENDING TOPICS
- IND vs ENG
- Maharashtra Crisis
- Agnipath
- Presidential Election
- Ukraine Crisis


ఇవి చూశారా?
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- 10th Results: కాసేపట్లో తెలంగాణ ‘టెన్త్’ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో చూడొచ్చు
ఎక్కువ మంది చదివినవి
(Most Read)సిరి జవాబులు
-
ఆరేళ్ల క్రితం ఒక యూనిట్ ఆధారిత బీమా పాలసీ (యులిప్) తీసుకున్నాను. ఏడాదికి రూ.80వేల ప్రీమియం చెల్లిస్తున్నాను. దీన్ని ఇప్పుడు రద్దు చేసుకోవచ్చా? దీనికి బదులుగా నెలనెలా ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యామ్నాయ పథకాలను సూచించండి?
సాధారణంగా యూనిట్ ఆధారిత బీమా పాలసీలకు అయిదేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. మీరు పాలసీ తీసుకొని, ఆరేళ్లు అయ్యింది కాబట్టి, ఎలాంటి రుసుములు లేకుండానే పాలసీని రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టుబడి కోసం ఈక్విటీ ఫండ్లను ఎంచుకుంటే.. ఇప్పుడు మార్కెట్ తక్కువగా ఉంది కాబట్టి, లాభం తక్కువగా ఉండొచ్చు. మార్కెట్ పూర్తిగా కోలుకునే దాకా వేచి చూడండి. ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బుతో అవసరం లేకపోతే.. రెండుమూడేళ్లు ఆగి తీసుకోండి. ముందుగా తగినంత మొత్తానికి బీమా తీసుకోండి. పెట్టుబడి కోసం హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి. -
నా వయసు 48. ప్రైవేటు ఉద్యోగిని. జీతం రూ.లక్ష. నెలకు సుమారు రూ.20 వేలు వివిధ పథకాల్లో మదుపు చేస్తున్నాను. దీనికి పీఎఫ్ అదనం. 58 ఏట నుంచి నెలకు రూ. లక్ష (పన్ను లేకుండా) రావాలంటే నా దగ్గర ఎంత మొత్తం ఉండాలి? దీనికోసం ఏం చేయాలి?
మీరు సుమారు 20 శాతం పన్ను శ్లాబులో ఉంటారని అనుకుందాం. అప్పుడు పన్ను తర్వాత మీకు నెలకు రూ.లక్ష అందాలంటే.. వార్షిక ఆదాయం రూ.15లక్షల వరకూ ఉండాలి. అప్పుడు రూ.3లక్షలు పన్ను పోను, నెలకు రూ.లక్ష చొప్పున అందుకోవచ్చు. మీ దగ్గర ఉన్న డబ్బు 6శాతం రాబడిని ఆర్జించేలా చూసుకుంటే.. పదేళ్ల తర్వాత రూ.2.5 కోట్ల నిధి ఉంటేనే ఇది సాధ్యం. 8 శాతం రాబడిచ్చే పథకాల్లో మదుపు చేస్తే రూ.1.87 కోట్లు అవసరం. ఇప్పటికే మీ దగ్గర ఎంత మొత్తం జమ అయ్యిందనే వివరాలు లేవు. ఇప్పటి నుంచి పదేళ్లలో రూ.2.5 కోట్లు జమ చేయాలంటే.. నెలకు రూ.125,000 మదుపు చేయాలి. రూ.1.87 కోట్లు కావాలంటే.. నెలకు రూ.93,500 కావాలి. ఈ పెట్టుబడిని 11 శాతం రాబడినిచ్చే పథకాలకు మళ్లించాలి. ఇప్పటికే మీ పీఎఫ్లో మంచి మొత్తం జమ అయి ఉంటుంది. పదవీ విరమణ నాటికి ఇది మరింత పెరుగుతుంది. కాబట్టి, ఇప్పుడు మీరు చేస్తున్న రూ.20 వేల పెట్టుబడిని మీ మిగులు మొత్తాన్ని బట్టి, పెంచుకునే ప్రయత్నం చేయండి. రిటైర్ అయ్యాక మొత్తం డబ్బును అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మదుపు చేసి, నెలనెలా రాబడిని అందుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.