close

తాజా వార్తలు

జెట్‌ విమానాలు మరింత తగ్గవచ్చు..


ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం కేవలం 41 విమానాలను మాత్రమే నిర్వహిస్తోంది. వాస్తవంగా ఆ సంస్థకు ఉన్న విమానాల సంఖ్యలో ఇది మూడో వంతు మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య మరింత తగ్గవచ్చని డీజీసీఏ పేర్కొంది. పరిస్థితి మరింత గడ్డుగా ఉందని.. జెట్‌ సంస్థ భవిష్యత్తులో విమానాల సంఖ్యను మరింత తగ్గించవచ్చని పేర్కొంది. 
జెట్‌ కీలక సిబ్బంది, పైలట్లు, కేబిన్‌ సిబ్బందిలు ఏమాత్రం ఒత్తిడికి గురైనా విధుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. ప్రస్తుతం పక్కన పెట్టిన విమానాలకు సమయం ప్రకారం చేయించాల్సిన నిర్వహణ సర్వీసింగ్‌లను చేయించాలని సూచించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు