close

ఆంధ్రప్రదేశ్

ఊరికే ఊళ్లు ఓటర్లు ఉండరు

నుషుల్లేని ఊర్లుంటాయా? ఓటర్లు లేని ఊళ్లున్నాయని చెబితే నమ్మగలమా? విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇలాంటి విచిత్ర పరిస్థితి ఉంది. ఇక్కడి లూలూరు, నిమ్మలోవ గ్రామాలు బ్రిటిష్‌ కాలం నుంచి రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికీ భూలావాదేవీలన్నీ అవే పేర్లతోనే జరుగుతున్నాయి. నిమ్మలోవలో భూములను పొట్టిదొరపాలెం రైతులు, లూలూరులో పొలాలను లోపూడి, బంగారుమెట్ట, లింగభూపాలపుర అగ్రహారం గ్రామాల ప్రజలు సాగు చేసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఒక్క ఇల్లూ కన్పించదు. మనుషుల జాడా ఉండదు. అందుకే ఆ గ్రామాల పరిధిలో ఓటర్లు ఉండరు. పూర్వం అక్కడ గ్రామాలు ఉండేవని, క్రమేణా ఖాళీ అయ్యాయని పెద్దలు చెబుతుంటారు. దానికి ఆనవాళ్లుగా ఇప్పటికీ ఆయా గ్రామాల పరిధిలో జరిగే తవ్వకాల్లో ఇటుకలు, మట్టిపాత్రలు బయల్పడుతుంటాయి. ఇటీవలే లూలూరులో డీఆర్‌డీఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

- న్యూస్‌టుడే, బుచ్చెయ్యపేట (విశాఖ జిల్లా)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు