కొవాగ్జిన్‌కు నేపాల్‌లోనూ అనుమతి! - Nepal gives emergency use approval to Covaxin
close

Published : 20/03/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్‌కు నేపాల్‌లోనూ అనుమతి!

కాఠ్‌మండూ: భారత్‌లో తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి నేపాల్‌ జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. దీంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగానికి ఇప్పటి వరకు మూడు దేశాల్లో అనుమతి లభించినట్లైంది. కరోనా నిరోధంపై 81 శాతం సమర్థత కనబరిచిన ఈ టీకా వినియోగానికి కేంద్ర ప్రభుత్వం జనవరిలోనే అత్యవసర వినియోగం కింద అనుమతులు జారీ చేసింది. ఈ నెల ఆరంభంలో జింబాబ్వే ప్రభుత్వం సైతం కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి పచ్చజెండా ఊపింది.

నేపాల్‌ ఇప్పటి వరకు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కొవిషీల్డ్‌, చైనాకు చెందిన సైనోఫార్మ్‌ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ-కోర్‌వీ టీకాల వినియోగానికి అనుమతినిచ్చింది. భారత్‌ బయోటెక్‌ తమ టీకా కోసం జనవరి 13న దరఖాస్తు చేసుకోగా తాజాగా అనుమతిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లో ఇప్పటి వరకు 2,75,750 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,016 మంది మరణించారు.

ఇవీ చదవండి...

కరోనా ఉద్ధృతి: 40 వేలు దాటిన కేసులు

కొవిడ్‌తో కొత్త పేదరికం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని