మార్కెట్లలో ఒడుదొడుకులు - Stock markets ends on flat note
close

Published : 08/03/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లలో ఒడుదొడుకులు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి స్వల్పంగా కోలుకొని లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం 50,654 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 50,985 వద్ద గరిష్ఠాన్ని.. 50,318 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 35 పాయింట్లు లాభపడి 50,441 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,002 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,111 - 14,919 మధ్య కదలాడి చివరకు 18 పాయింట్ల స్వల్పలాభంతో 14,956 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.21 వద్ద నిలిచింది.

అమెరికా ఉద్యోగ కల్పన సమాచారం నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ఉదయం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. కానీ మధ్యలో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో చివరకు మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ సూచీ నిక్కీ 0.2 శాతం, ఆస్ట్రేలియా సూచీ ఎస్‌అండ్‌పీ/ఏఎస్‌ఎక్స్‌ 1శాతం లాభపడగా... దక్షిణ కొరియా సూచీ కోస్పీ 0.2 శాతం, హాంగ్‌కాంగ్ సూచీ హాంగ్‌ సెంగ్‌ 1.2 శాతం, షాంఘై కాంపోజిట్‌ 0.5 శాతం నష్టపోయాయి. ఇక దేశీయంగా స్థిరాస్తి, ఎఫ్ఎంసీజీ, టెలికాం, ఆర్థిక, ఆటో రంగ సూచీలు నష్టాలు చవిచూడం సూచీలను కట్టడి చేశాయి. ఈ పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి.

యూపీఎల్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, ఎల్‌అండ్‌టీ, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు లాభాలను ఆర్జించాయి. శ్రీ సిమెంట్‌, బజాజ్‌ ఫినాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని