close
నష్టాలు కొనసాగుతున్నాయ్‌! 

చివరి గంటలో సూచీలు డీలా 
వెల్లువెత్తిన విదేశీ మదుపర్ల విక్రయాలు 


సమీక్ష

సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. విదేశీ మదుపర్లు షేర్ల విక్రయాలకే మొగ్గు చూపారు. అధికాదాయ వర్గంపై సర్‌ఛార్జి పెంపు ప్రభావం కొనసాగింది. దీనికితోడు దేశీయ కార్పొరేట్‌ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటం మదుపర్లను కలవరపెట్టింది. దీంతో సెన్సెక్స్‌ 48 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్ల మేర నష్టపోయాయి. అంతర్జాతీయ సూచీలకొస్తే ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు కూడా ఇదే బాటలో నడిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 2 పైసలు నష్టపోయి 68.94 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 38,138.56 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ ఆ తర్వాత వచ్చిన స్వల్ప కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వచ్చింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగినా, మధ్యాహ్నం తర్వాత ఒక దశలో 38,217.81 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరి గంటలో విక్రయాల ఒత్తిడి తలెత్తడంతో 37,898.90 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 48.39 పాయింట్ల నష్టంతో 37,982.74 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 15.15 పాయింట్లు కోల్పోయి 11,331.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,398.20-11,302.80 పాయింట్ల మధ్య కదలాడింది.

కోటక్‌ బ్యాంక్‌ తొలి త్రైమాసిక నికర లాభం 23 శాతం మేర పెరగడంతో షేరు బీఎస్‌ఈలో 3 శాతం వరకు లాభపడి రూ.1,493.70 వద్ద స్థిరపడింది. 
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో షేరు బీఎస్‌ఈలో 4 శాతం వరకు లాభపడి రూ.508.60 వద్ద ముగిసింది. 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పరిష్కార ప్రణాళికకు ఈ నెలాఖరులోపు రుణదాతల అంగీకారం వస్తుందన్న అంచనాలతో షేరు దూసుకెళ్లింది. బీఎస్‌ఈలో 14.16 శాతం లాభంతో రూ.60.05 వద్ద ముగిసింది. 
నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినందున, టీవీఎస్‌ మోటార్‌ షేరు బీఎస్‌ఈలో 2.52 శాతం కోల్పోయి రూ.370.10 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌ అత్యధికంగా 3.14 శాతం లాభపడింది. కోటక్‌ బ్యాంక్‌ 2.76%, హీరో మోటోకార్ప్‌ 2.68%, ఐటీసీ 2.38%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.78%, ఎన్‌టీపీసీ 1.60%, హెచ్‌యూఎల్‌ 0.86%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.83%, ఇన్ఫోసిస్‌ 0.60% చొప్పున లాభపడ్డాయి. ఎస్‌బీఐ అత్యధికంగా 2.49 శాతం నష్టపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ 2.24%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.44%, బజాజ్‌ ఆటో 1.43%, ఓఎన్‌జీసీ 1.36%, టాటా స్టీల్‌ 1.10%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.70%, మారుతీ సుజుకీ 0.62%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 0.60% మేర నష్టపోయాయి.

నేటి బోర్డు సమావేశాలు 
ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, వీగార్డ్‌, జుబిలెంట్‌ ఫుడ్‌ వర్స్స్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, సిగ్నిటీ టెక్నాలజీస్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, లిబర్టీ షూస్‌, మోన్‌శాంటో ఇండియా, నెల్కో, ఒబెరాయ్‌ రియాల్టీ, క్వెస్‌ కార్ప్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, సాగర్‌ సిమెంట్స్‌, సిండికేట్‌ బ్యాంక్‌,

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.