
తాజా వార్తలు
మహాబలేశ్వర్ అందాల్లో ‘ఆర్ఆర్ఆర్’
ఇంటర్నెట్ డెస్క్: ఈమధ్య వరుస అప్డేట్లు ఇస్తోంది దర్శకధీరుడు జక్కన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. చిత్రీకరణకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. అందరిలో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇటీవల షెడ్యూల్‌కు సంబంధించి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్న సినిమా యూనిట్ తాజాగా.. మరో వీడియోను పోస్టు చేసింది. ఓ చిన్న షెడ్యుల్‌లో భాగంగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లోని అందమైన పరిసరాల్లో తారక్, చరణ్‌ల మధ్య ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్నట్లు, పనులు శరవేగంగా సాగుతున్నాయని పోస్టులో పేర్కొంది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా పంచుకుంది.
అందులో.. రోడ్డు మీద బైక్‌పై ఓ వ్యక్తి దూసుకొస్తున్న సన్నివేశాన్ని డ్రోన్ సహాయంతో చిత్రీకరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి.. ఎన్టీఆర్, తారక్.. ఈ ఇద్దరిలో ఆ వ్యక్తి ఎవరు..? అనే విషయాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచింది. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లో 50రోజుల భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరణ పూర్తి చేసుకొని షెడ్యుల్‌కు ప్యాకప్ చెప్పింది. దీని తర్వాత జక్కన్న జట్టు మహారాష్ట్రలోని పుణెకు పయనమైంది. దానికి సమీపంలోని మహాబలేశ్వర్ అందమైన పరిసరాల్లో ఓ సన్నివేశం తీసేందుకు అక్కడికి చేరుకుంది చిత్రబృందం. అది పూర్తవగానే మళ్లీ పుణెకు చేరుకునే అవకాశం ఉంది.
‘ఆర్.ఆర్.ఆర్’లో సీతారామరాజుగా చరణ్ అల్లూరి, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదీ చదవండి..
ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ రికార్డుల వేట