రాకపోకలు నిలిచినా పట్టించుకోరా?
eenadu telugu news
Published : 29/07/2021 00:57 IST

రాకపోకలు నిలిచినా పట్టించుకోరా?

కొట్టుకుపోయిన వంతెనను పరిశీలిస్తున్న భాజపా నాయకులు

ధారూర్‌: న్యూస్‌టుడే: వంతెనల పనులను వెంటనే పూర్తిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం మండల పరిధి నాగసమందర్‌, దోర్నాల వంతెనలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దోర్నాల్‌, నాగారం, కోట్‌పల్లి, బంట్వారం, తాండూరు తదితర గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులు గడుస్తున్నా కనీసం తాత్కాలిక మరమ్మతు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్‌, నాయకులు రమేష్‌, వివేకానందారెడ్డి, రాజేందర్‌గౌడ్‌, శివమణి, నరేందర్‌రెడ్డి ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని