మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు
close

తాజా వార్తలు

Updated : 17/06/2021 15:15 IST

మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు

విజయనగరం: ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారదర్శకతతో ముందుకెళ్తున్నామన్నారు. అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాన్సాస్‌ ట్రస్టు సిబ్బందికి జీతాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్యాలయాన్ని విజయనగరం నుంచి ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఆడిట్‌ జరగలేదని తెలిసి ఆశ్చర్యపోయాను, ఆడిట్‌ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. దోపిడీ దారులకు మాన్సాస్‌లో స్థానం లేదని స్పష్టం చేశారు. రామతీర్థం ఆలయానికి పంపిన చెక్కును కూడా వెనక్కి పంపి తనను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. రామతీర్థం విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రస్ట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లీజు గడువు పూర్తయిన ట్రస్టు భూములను వేలం వేయాలని ఆదేశించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యాకలాపాల వివరాలు ,  పదేళ్లుగా ఆడిటింగ్‌కు చెల్లించిన ఫీజు వివరాలు ఈనెల 21లోగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

అక్రమాలు బయటపెడతాం: వెల్లంపల్లి
అశోక్‌గజపతిరాజు హయాంలో మాన్సాస్‌ ట్రస్టులో అక్రమాలు జరిగాయని, అన్నీ త్వరలోనే బయటపెడతామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఇవాళ సింహాచలంలో సింహాద్రి అప్పన్నను మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... దేవాదాయశాఖ నిధులను వాహనమిత్రకు తరలించారనే ఆరోపణల్లో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. దేవాదాయశాఖ నుంచి నిధులను మళ్లించేందుకు ఎక్కడా అవకాశం లేదని, అశోక్‌గజపతిరాజు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని