Top 10 News @ 1PM

తాజా వార్తలు

Published : 23/04/2021 12:56 IST

Top 10 News @ 1PM

1. Corona: మూడో రోజు 2వేలకు పైనే మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. మూడు రోజులుగా రెండు వేలమందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని వైరస్ సంక్రమణ భారత్‌లో కనిపిస్తుండటం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు పరిస్థితి తీవ్రతను కళ్లకుకడుతున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. Corona: కేటీఆర్‌కు పాజిటివ్‌

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. పరీక్షల్లో తనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌ ద్వారా ఆయన వెల్లడించారు.  స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలని.. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. విశాఖ భూములపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో ఐదు చోట్ల భూముల అమ్మకానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో బిల్డ్‌ ఏపీ పేరిట అమ్మకాలపై స్టే ఇచ్చిన విషయాన్ని పిటిషనర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అవే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికీ వర్తిస్తాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. TS: రాష్ట్రానికి యుద్ధవిమానాల్లో ఆక్సిజన్‌

ఆక్సిజన్‌ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తోంది. ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని  భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయి. భువనేశ్వర్‌ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుంది. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బేగంపేట విమానాశ్రయంలో ప్రక్రియను పరిశీలించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. 25మంది చనిపోయారు..ఆక్సిజన్‌ పంపండి ప్లీజ్‌

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశ రాజధాని దిల్లీలో అనేక ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు త్వరలో నిండుకోనున్నట్లు సమాచారం. ప్రముఖ సర్‌ గంగా రామ్‌ ఆస్పత్రిలో మరో రెండు గంటలకు మాత్రమే సరిపడా ఆక్సిజన్‌ ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ఉదయం తెలిపాయి. ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న 60 మంది రోగుల భవితవ్యం ప్రమాదంలోకి జారుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమయింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. కోహ్లీ.. ఐపీఎల్‌ వేటగాడు!

విరాట్‌ కోహ్లీ.. సమకాలీన క్రికెట్‌లో మేటి ఆటగాడు. ఫార్మాట్‌ ఏదైనా తన ముద్ర చూపిస్తూ దూసుకుపోయే పరుగుల వేటగాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా తనదైన శైలిలో జట్టును నడిపిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ ఏడాది ట్రోఫీ నెగ్గాలన్న కసితో పరుగుల దాహం పెంచుకుని 6000 పరుగుల మైలురాయి దాటాడు ఈ ఛేదన రారాజు. ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. చిరు నిర్ణయంపై తమిళిసై హర్షం

సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అగ్రకథానాయకుడు చిరంజీవి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘తెలుగు సినీ దిగ్గజ నటుడు శ్రీ చిరంజీవిగారు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అపోలో సహకారంతో సినీ కార్మికులు, సినీ జర్నలిస్ట్‌లకు ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది ఒక మంచి ప్రయత్నం’ అని ఆమె పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. ఆ గ్రామంలో సగం మందికి కరోనా 

కరోనా మహమ్మారి యావత్ భారతాన్ని కమ్మేసింది. రద్దీ నగరాలతో పాటు పల్లెల్లోనూ వైరస్‌ ప్రతాపం తీవ్రంగా కన్పిస్తోంది. కర్ణాటకలో ఓ గ్రామంలో ఏకంగా సగం మంది వైరస్ బారినపడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. బెళగావిలోని అబనాళి గ్రామంలో 300 మంది జనాభా ఉండగా.. ఇందులో ఇప్పటివరకు 144 మంది వైరస్‌ బారినపడ్డారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. పబ్లిక్‌ టాయిలెట్లతో జర భద్రం!

ఎక్కువమంది వెళ్లే మూత్రశాలలను, మరుగుదొడ్లను వినియోగించేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు... ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు! మరుగుదొడ్డిలో ఫ్లష్‌ ద్వారా నీళ్లు కొట్టేటప్పుడు వేల సంఖ్యలో గాలితుంపర్లు విడుదలవుతాయని, వాటి ద్వారా కరోనా సహా రకరకాల వైరస్‌లు సోకే ప్రమాదముందని వారు కనుగొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. పెద్దలందరికీ టీకా.. రూ.67,193 కోట్లు కావాలి

దేశంలో 18 ఏళ్లు నిండిన పెద్దలందరికీ టీకా వేసేందుకు రూ.67,193 కోట్ల మేర ఖర్చు అవుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. ఈ విలువ దేశ జీడీపీలో 0.36 శాతమేనని పేర్కొంది. కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలకు పైగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీకా పంపిణీ మూడో దశ కార్యక్రమాన్ని మే 1 నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని