close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/04/2020 17:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ అభిమానులకు మళ్లీ నిరాశే!

ముంబయి: ఐపీఎల్‌ అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఐపీఎల్‌ 13వ సీజన్ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా? అని ఎదురు చూసే క్రికెట్‌ ప్రేమికులకు.. తాజాగా లాక్‌డౌన్‌ పొడిగించడంతో ఈ విషయంపై మరింత ఉత్సుకత ఏర్పడింది. భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దీంతో అప్పటివరకు ఈ సీజన్‌ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌ ప్రారంభంకావాల్సింది.

అంతకుముందే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో బీసీసీఐ పునరాలోచించి ఈ సీజన్‌ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేసింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఈసారి మెగా టోర్నీపై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మే 3 వరకూ బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకునేలా కనిపించడం లేదు. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సోమవారం ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల మధ్య వరకూ మెగా టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదని చెప్పాడు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.