close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరోగ్యానికి తోడు.. నేరేడు

ఆరోగ్యానికెంతో మేలు చేసే నేరేడు పండు ఈ కాలంలో మాత్రమే లభిస్తుంది. ఔషధాల్లోనూ విరివిగా ఉపయోగించే ఈ పండులో ఏయే పోషకాలున్నాయో తెలుసుకుందామా... ●

* నేరేడులో క్యాల్షియం, ఇనుము, పొటాషియం, విటమిన్‌- ఎ, సిలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గూ, జలుబులాంటి ఇబ్బందుల బారిన పడకుండా ఈ పండు కాపాడుతుంది.

* గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ బాధితులు కూడా ఈ పండ్లను తినొచ్ఛు వీటిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

* దీంట్లోని యాంటీఆక్సిడెంట్‌లు దంత సమస్యలను నివారిస్తాయి. అంతేకాదు వయసు పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులను నియంత్రిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.

* ఇందులో ఉండే విటమిన్‌-ఎ, సి కంటి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇక క్యాల్షియం ఎముకలు బలంగా ఉండేందుకు సాయపడుతుంది.

* ఆస్తమా, బ్రాంకైటిస్‌లాంటి శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడేవాళ్లు దీన్ని తీసుకోవడం వల్ల ఉపశనం లభిస్తుంది.

* దీంట్లో ఉండే ఇనుము, విటమిన్‌-సి రక్తహీనతను నివారిస్తాయి. రక్తపోటునూ నియంత్రిస్తాయి.

* జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఎసిడిటీ ఇబ్బందినీ తగ్గిస్తుంది నేరేడు.

* దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరిచి, పనితీరును మెరుగుపరుస్తాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.