ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌గా జస్టిస్‌ మందాట!
close

తాజా వార్తలు

Updated : 17/03/2021 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌గా జస్టిస్‌ మందాట!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌గా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మందాట సీతారామమూర్తి పేరును ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర అత్యున్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. జ్యుడీషియల్‌ సభ్యులుగా విశ్రాంత జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా న్యాయవాది గోచిపాత శ్రీనివాసరావు పేర్లను ప్రతిపాదించింది. ఈ ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  గవర్నర్ ఆమోదానికి నివేదిక పంపింది.

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కమిటీ వీరి పేర్లను ఖరారు చేసింది. ఈ సమావేశానికి సభాపతి తమ్మినేని సీతారాం‌, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌, హోం మంత్రి సుచరిత హాజరయ్యారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, మండలిలో విపక్షనేత యనమల రామకృష్ణుడు గైర్హాజరయ్యారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని