తైవాన్‌పై దండెత్తిందా అనిపించేట్లు..
close

తాజా వార్తలు

Published : 13/04/2021 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తైవాన్‌పై దండెత్తిందా అనిపించేట్లు..


ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌ (ఏడీఐజెడ్‌)లోకి భారీ స్థాయిలో చైనా విమానాలు చొరబడ్డాయి. వీటిలో అణు బాంబులను జారవిడిచే బాంబర్లు కూడా ఉన్నాయి. మొత్తం 25 విమానాలు తమ గగనతలంలోకి చొరబడినట్లు సోమవారం తైవాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఇదే అత్యధిక విమానాల చొరబాటని వెల్లడించింది. తైవాన్‌ విషయంలో దూకుడుగా ఉంటే చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో  ఇది జరగడం గమనార్హం. ఆదివారమే అమెరికా విదేశాంగ  మంత్రి ఆంటోని బ్లింకన్‌ చైనా దూకుడు చర్యలపై స్పందించారు.. ఆ మర్నాడే చైనా విమనాలు తైవాన్‌ గగనతలంలోకి ప్రవేశించాయి.  

తాజాగా మొత్తం 18 ఫైటర్‌ జెట్‌ విమానాలు, రెండు నుంచి నాలుగు న్యూక్లియర్‌ బాంబర్లు, రెండు యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌‌ విమానాలు, ఒక ఎర్లీ వార్నింగ్‌ విమానం.. ఈ బృందంలో  ఉన్నట్లు తైవాన్‌ వెల్లడించింది. ఇటీవల తైవాన్‌ సముద్ర జలాలు, ఆ దేశ‌ ఆధీనంలోని ద్వీపాల సమీపంలోకి చైన్‌ జెట్‌ విమానాల సంచారం పెరిగిపోయింది.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని