close

తాజా వార్తలు

సీఈఆర్‌టీ దృష్టికి తీసుకురావాలి..కేంద్రమంత్రి

దిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా 3.13 లక్షల సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయని రాజ్యసభలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. భారతీయ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సీఈఆర్‌టీ) వెల్లడించిన డేటా ఆధారంగా 2019లో (అక్టోబర్‌ చివరి నాటికి) 3,13,649, 2015లో 49,455, 2016లో 50,362, 2017లో 53,117, 2018లో 2,08,456 సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనలు నమోదయ్యాయని మంత్రి వివరించారు. ఇలాంటి భద్రత సంబంధిత సంఘటనలు జరిగినప్పుడు సర్వీస్‌ ప్రొవైడర్లు, డేటా సెంటర్లు, కార్పొరేట్‌ సంస్థలు సీఈఆర్‌టీ దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇవే కాకుండా మలీషియస్‌ కోడ్‌ ఎటాక్స్‌, సర్వర్లపై దాడి, దొంగతనం, మాల్‌వేర్‌ ఎటాక్స్‌, సర్వీస్‌ ఎటాక్స్‌, క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌, సూపర్‌వైజరీ కంట్రోల్‌ ఎండ్‌ డేటా అక్విసిషన్‌ (స్కాడా), ఈ-గవర్నెన్స్‌, ఈ-కామర్స్‌ వ్యవస్థలపై దాడి.. లాంటి సంఘటనలు చోటుచేసుకుంటే సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.