టీకాల ఎగుమతిపై నిషేధం లేదు: కేంద్రం
close

తాజా వార్తలు

Updated : 02/04/2021 19:18 IST

టీకాల ఎగుమతిపై నిషేధం లేదు: కేంద్రం

దిల్లీ: కొవిడ్ టీకాల ఎగుమతులకు సంబంధించి ఎలాంటి నిషేధమూ విధించలేదని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు 80కి పైగా దేశాలకు టీకా సరఫరా చేశామని ఆయన తెలిపారు. 

దేశీయంగా కరోనా టీకా డిమాండ్‌ను తీర్చేందుకు.. సీరం సంస్థ కెనడాకు టీకా ఎగుమతిని నిరవధికంగా నిలిపివేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ‘దేశీయంగా దశలవారీగా టీకా అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. రానున్న రోజుల్లో భారత్ తన భాగస్వామ్య దేశాలకు టీకా సరఫరాను కొనసాగిస్తుంది. ఈ నిర్ణయంతో ఎలాంటి మార్పులేదు’ అని అప్పుడే ఆ వార్తలను సంబంధిత వర్గాలు ఖండించాయి. తాజాగా మరోసారి ఎగుమతుల అంశంపై స్పష్టతనిచ్చాయి. జనవరి 20 నుంచి భారత్ విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తోంది. ఇప్పటివరకు 84 దేశాలకు 64 మిలియన్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు రెండు రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని