మహారాష్ట్రలో మళ్లీ గవర్నర్ vs సీఎం

తాజా వార్తలు

Published : 11/02/2021 15:26 IST

మహారాష్ట్రలో మళ్లీ గవర్నర్ vs సీఎం

ప్రభుత్వ విమానానికి నో.. ఎయిర్‌పోర్టులోనే గవర్నర్‌

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్‌, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి బయటికొచ్చాయి. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాష్ట్ర ప్రభుత్వవిమానంలో ప్రయాణించేందుకు ఠాక్రే సర్కారు అనుమతి నిరాకరించింది. దీంతో గవర్నర్‌ రెండు గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..

‘మహా’ గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యార్‌ గురువారం ఉత్తరాఖండ్‌ పర్యటనకు వెళ్లేందుకు రాష్ట్రప్రభుత్వానికి చెందిన విమానాన్ని బుక్‌ చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ముంబయి నుంచి డెహ్రాడూన్‌ వెళ్లాల్సి ఉంది. ఈ ఉదయం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఆయన నేరుగా విమానంలోకి వెళ్లి కూర్చున్నారు. అయితే 15 నిమిషాల తర్వాత పైలట్‌ వచ్చి ఈ విమానంలో ప్రయాణానికి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల పేర్కొన్నాయి. దీంతో విమానం దిగిన గవర్నర్‌.. మరో విమానం కోసం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో రెండు గంటల పాటు ఉండిపోయారు. మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్‌ బుక్‌ చేసుకుని గవర్నర్‌ డెహ్రాడూన్‌ వెళ్లిపోయినట్లు సదరు వర్గాలు తెలిపాయి. 

ఈ పరిణామాలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ను అడగ్గా.. తన వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అయితే ఠాక్రే సర్కారు తీరుపై ప్రతిపక్ష భాజపా తీవ్రంగా మండిపడుతోంది. గవర్నర్‌ ప్రయాణం గురించి వారం ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కావాలనే అనుమతి ఇవ్వలేదని ఆరోపించింది. గవర్నర్‌ను అవమానించినందుకు గానూ మహా వికాస్‌ అఘాడీ కూటమి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. 

కాగా.. ఠాక్రే ప్రభుత్వం, గవర్నర్‌ కోశ్యారీ మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఆలయాలు, ప్రార్థనామందిరాలను తెరిచే అంశంపై సీఎం ఠాక్రే, కోశ్యారీ వాడీవేడీగా లేఖలు రాసుకున్నారు. పరస్పరం వ్యంగ్యాస్త్రాలను సంధించుకున్నారు. 

ఇవీ చదవండి..

ఈ బడ్జెట్‌ పేదలకా? సంపన్నులకా?

స్వేచ్ఛనిచ్చాం.. కానీ చట్టాలను పాటించాల్సిందే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని