Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 100095
            [news_title_telugu_html] => 

ఇరాక్‌ నుంచి ఎక్సాన్‌ మొబైల్‌ ఉద్యోగులు వాపస్‌

[news_title_telugu] => ఇరాక్‌ నుంచి ఎక్సాన్‌ మొబైల్‌ ఉద్యోగులు వాపస్‌ [news_title_english] => Exxon Mobil Reportedly Evacuates Staff From Iraqi Oilfield Amid US Iran Tension [news_short_description] => ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్‌లో ఉన్న ఎక్సాన్‌ మొబైల్‌ సంస్థ తమ ఉద్యోగులను అక్కడి నుంచి వెనక్కి పిలిపించింది. ఇరాక్‌ పశ్చిమ కురానా చమురు క్షేత్రాల్లో పనిచేస్తున్న విదేశీ సిబ్బందిని అక్కడి నుంచి [news_tags_keywords] => US,Iran,business [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-19 00:39:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఇరాక్‌ నుంచి ఎక్సాన్‌ మొబైల్‌ ఉద్యోగులు వాపస్‌ - Exxon Mobil Reportedly Evacuates Staff From Iraqi Oilfield Amid US Iran Tension - EENADU
close

తాజా వార్తలు

ఇరాక్‌ నుంచి ఎక్సాన్‌ మొబైల్‌ ఉద్యోగులు వాపస్‌

బాగ్దాద్‌: ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్‌లో ఉన్న ఎక్సాన్‌ మొబైల్‌ సంస్థ తమ ఉద్యోగులను అక్కడి నుంచి వెనక్కి పిలిపించింది. ఇరాక్‌ పశ్చిమ కురానా చమురు క్షేత్రాల్లో పనిచేస్తున్న విదేశీ సిబ్బందిని అక్కడి నుంచి దుబాయ్‌కు తరలించింది. శుక్రవారం నుంచే వీరి తరలింపు మొదలై శనివారంతో ముగించింది. కొందరు దుబాయ్‌ వెళ్లగా మరికొందరు ప్రధాన క్యాంప్‌ అయిన బస్రకు చేరుకొన్నారు. వీరి తరలింపుతో చమురు ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం పడదని ఇరాక్‌ అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి తరలి వెళ్లిన వారి స్థానంలో ఇరాక్‌కు చెందిన ఇంజినీర్లు విధుల్లోకి చేరారని వెల్లడించారు. 
అంతకు ముందే అమెరికాకు చెందిన అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన వారందరూ ఇరాక్‌ను వీడి వెళ్లిపోవాలని స్టేట్‌ డిపార్ట్‌ మెంట్‌ ఆదేశాలను జారీ చేసింది. ఇది జరిగిన వెంటనే నెదర్లాండ్స్‌, జర్మనీలు ఇరాక్‌లో సైనిక శిక్షణ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ప్రకటించాయి. మరోపక్క ఫెడరల్‌ ఏవియేషన్‌  కూడా కొన్ని సూచనలు జారీ చేసింది. పర్షియన్‌ గల్ఫ్‌ గగనతలం నుంచి ప్రయాణించే వాణిజ్య విమానాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. పౌరవిమాన పైలట్ల ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలని పేర్కొంది. 
పర్షియన్‌ గల్ఫ్‌లోకి అమెరికా తమ దళాలను భారీగా తరలించడం మొదలుపెట్టడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవల అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక అబ్రహం లింకన్‌ కూడాఅక్కడకు చేరుకొంది. దీంతోపాటు బాంబర్‌ టాస్క్‌ ఫోర్స్‌ కూడా పర్షియన్‌ గల్ఫ్‌కు ప్రయాణించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఎటువంటి సాయుధ దాడినైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్‌ వెల్లడించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.