close

తాజా వార్తలు

నిరాశపర్చిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌..!

ముంబయి: స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌ షేర్లు లిస్టింగ్‌ సమయంలో నిరాశపర్చాయి. ఇటీవల ఐపీవోకు వచ్చిన ఈ సంస్థ నేడు మార్కెట్లో లిస్టైంది. ఈ షేర్లను ఐపీవోలో రూ.780 వద్ద కేటాయించారు.. కానీ, నేడు లిస్టింగ్‌లో 10.25శాతం తక్కువగా రూ.700 వద్ద లిస్టయ్యాయి. ఉదయం 10.02 సమయంలో ఈ కంపెనీ షేర్లు రూ.714.05 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది ఐపీవో ధర కంటే 8.46శాతం తక్కువ. 
ఆగస్టు 6-8 వరకు ఈ కంపెనీ  ఐపీవోను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈషేర్  ప్రైస్‌బ్యాండ్‌ రూ.775-రూ.780 మధ్యలో నిర్ణయించారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో జరిగిన ఈ ఇష్యూ ద్వారా రూ.3,100 కోట్లు సేకరించారు. ఇష్యూ తర్వాత కంపెనీ విలువ రూ.12,500గా అంచనావేశారు. ఈ కంపెనీకి షాపూర్జీ పల్లోంజీ గ్రూపు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ నుంచి సోలార్‌ ఇంజినీరింగ్‌ వ్యాపారాన్ని విడదీసి ఐపీవోకు వచ్చారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.