Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146147
            [news_title_telugu_html] => 

విండీస్‌పై విరాట్‌ది ‘4’ వ్యూహమే!

[news_title_telugu] => విండీస్‌పై విరాట్‌ది ‘4’ వ్యూహమే! [news_title_english] => Kohli hints at four bowler strategy for series opener [news_short_description] => వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత జట్టు నలుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. పిచ్‌ను బట్టి ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లను ఎంచుకుంటామని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ సూచన చేశాడు. వివ్‌రిచర్డ్స్‌... [news_tags_keywords] => World Test Championship,Virat Kohli,IndvsWI,Rohit sharma,ajinkya rahane [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:44:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విండీస్‌పై విరాట్‌ది ‘4’ వ్యూహమే! - Kohli hints at four bowler strategy for series opener - EENADU
close

తాజా వార్తలు

విండీస్‌పై విరాట్‌ది ‘4’ వ్యూహమే!

నార్త్‌సౌండ్‌ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత జట్టు నలుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. పిచ్‌ను బట్టి ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లను ఎంచుకుంటామని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ సూచన చేశాడు. వివ్‌రిచర్డ్స్‌ మైదానంలో పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను కరీబియన్‌ జట్టు చిత్తుచేసిన సంగతి తెలిసిందే.

‘కవర్లు కప్పడంతో పిచ్‌ను ఇంకా పరిశీలించలేదు. వికెట్‌ను చూసిన తర్వాత ముగ్గురు పేసర్లు+ఒక స్పిన్నర్‌, ఇద్దరు పేసర్లు+ఇద్దరు స్పిన్నర్లలో ఏది అత్యుత్తమమో ఎంచుకుంటాం. ఇక్కడ చివరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ ఆడింది. పిచ్‌పై వైవిధ్యమైన బౌన్స్‌ కనిపించింది. ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి. మా జట్టు అన్ని పరిస్థితులకు తగ్గట్టు ఉంది’ అని కోహ్లీ అన్నాడు. టీమిండియా 7నెలల తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడబోతోంది. చివరగా ఆసీస్‌లో కంగారు సేనపై 2-1తో విజయం సాధించింది. సాధారణంగా కోహ్లీ ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగేందుకు ఇష్టపడతాడు. 20 వికెట్లు తీయాలంటే జట్టులో ఎక్కువ బౌలర్లు అవసరమని భావిస్తాడు. రోహిత్‌, రహానె  కారణంగా ఈ సారి నలుగురు బౌలర్లతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. 

‘పెర్త్‌లో ఓటమి పాలయ్యాక తర్వాత మ్యాచ్‌లో ఏం చేయాలో అర్థమైంది. దాంతో సిరీస్‌ గెలిచాం. టెస్టు క్రికెట్‌లో పొరపాట్లను ఎంత త్వరగా సరిదిద్దుకుంటాం, ఓటముల నుంచి ఎంత త్వరగా పాఠాలు నేర్చుకుంటామన్నది కీలకం. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలవాలంటే ఇవన్నీ తప్పవు. సుదీర్ఘ ఫార్మాట్లలో ఆటను ఎలా నియంత్రణలో ఉంచుకోవాలని మేం నేర్చుకున్నాం. ఒక్క సెషన్‌లో 6 వికెట్లు చేజార్చుకోకూడదు. అలాచేస్తే ఎప్పటికీ పుంజుకోలేం. ఛాంపియన్‌షిప్‌తో పోటీ రెట్టింపైంది’ అని విరాట్‌ అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.