close

తాజా వార్తలు

తాజ్‌ సంరక్షణకు ప్రభుత్వం చర్యలు

ఆగ్రా: ఉత్తర భారతంపై కాలుష్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజ్‌ మహల్‌ వద్దకు ఎయిర్‌ ఫ్యూరిఫైయర్‌ వాహనాన్ని పంపింది. 300 మీటర్ల పరిధిలో 8 గంటల్లో 15 లక్షల ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేసే సామర్థ్యం ఈ వాహనానికి ఉంది.

కాలుష్యం వల్ల వందల ఏళ్ల నాటి పాలరాయి కట్టడం దెబ్బ తింటోందని పరిశోధకులు చెబుతున్న సంగతి తెలిసిందే. జిల్లా యంత్రాంగం, యూపీపీసీబీ, టెలికాం సంస్థ వొడాఫోన్‌-ఐడియా కలిసి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రెండు ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ వాహనాలను సమకూర్చినట్లు అధికారులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.