Priyanka Mohan: ప్రియాంక మోహన్‌

తెరపై ఎంతోమంది కథానాయికలుగా మెరుస్తుంటారు. వారిలో మన అమ్మాయిలాగే ఉందనిపించుకొనే భామలు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి అమ్మాయే ప్రియాంక అరుళ్‌ మోహన్‌. ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ తాజాగా తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన విశేషాలు. 

Updated : 26 Jan 2024 14:09 IST
1/12
కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన ప్రియాంక.. ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ (2019)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.

2/12
శర్వానంద్‌ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంది.

3/12
‘డాక్టర్’, ‘డాన్‌’ (శివకార్తికేయన్‌), ‘ఈటీ’ (సూర్య) సినిమాలతో అలరించింది. ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (ధనుష్‌) విడుదలైంది. ‘బ్రదర్‌’ (జయం రవి) చిత్రంలో నటిస్తోంది.

4/12
ఇప్పుడు తెలుగులోనూ హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌తో ‘ఓజీ’, నానితో ‘సరిపోదా శనివారం!’ చిత్రాల్లో హీరోయిన్‌గా ఎంపికైంది.

5/12
రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించనున్న నాలుగో సినిమాలో ప్రియాంకను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

6/12
తన తొలి తెలుగు సినిమాలోని పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పింది. చెన్నైలో పుట్టింది. బెంగళూరులో పెరిగింది. అక్కడే బయో టెక్నాలజీ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. సినిమాల్లోకి రాకముందే తెలుగు నేర్చుకుంది.

7/12
ప్రియాంక చదువుకునే రోజుల్లో థియేటర్స్‌ ఆర్ట్స్‌లో చురుగ్గా వ్యవహరించేది. అలా నటనపై మక్కువ పెంచుకుంది. అదే చిత్ర పరిశ్రమలోకి రావడానికి కారణమైంది.

8/12
తెర వెనుక తాను ఎలా ఉంటుందో తెరపైనా అలానే ఉండాలనుకుంటుంది. మిత భాషి. స్నేహితులు తక్కువ.

9/12
పాటలు వినడం, సినిమాలు చూడడం, ప్రయాణాలు చేయడం ఇష్టం. హీరోయిన్లు నిత్యా మేనన్‌, అనుష్క, నజ్రియా అంటే అభిమానం.

10/12
11/12
12/12

మరిన్ని