Samyuktha: సంయుక్త

వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు నటి సంయుక్త (Samyuktha). ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘డెవిల్‌’ (Devil). సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సంయుక్తకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

Updated : 29 Dec 2023 16:17 IST
1/17
కేరళలోని పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త 21 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

2/17
2016లో విడుదలైన ‘పాప్‌కార్న్‌’ (మలయాళం) ఆమె తొలి చిత్రం. ఇందులో ఆమె అంజనా అనే పాత్రలో కనిపించారు.

3/17
తొలి చిత్రంతోనే విజయం అందుకున్న సంయుక్తకు మలయాళంతోపాటు తమిళంలోనూ సినిమా అవకాశాలు దక్కాయి.

4/17
2018లో విడుదలైన ‘లిల్లీ’ (మలయాళం) సంయుక్త కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. ఇందులో ఆమె టైటిల్‌ రోల్‌ పోషించారు.

5/17
‘భీమ్లానాయక్‌’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రానాకు జంటగా కనిపించారు. ఈ సినిమా కోసం ఆమె తెలుగు నేర్చుకున్నారు.

6/17
‘భీమ్లానాయక్‌’లో సంయుక్త నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆమెను తెలుగులో వరుస అవకాశాలు వరించాయి.

7/17
ఈ ఏడాది విడుదలైన ‘విరూపాక్ష’లో నందినిగా ఆమె నటించారు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఆమె నటన సినీ ప్రియులను కట్టిపడేసింది.

8/17
‘నటిగా విలక్షణమైన పాత్రల్లో నటించాలనే ఆలోచన నాకు ఉంది. అందుకు అనుగుణంగా కెరీర్‌ మొదలైన నాటి నుంచి విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నా’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె.

9/17
‘నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను. స్టార్‌ హీరోయిన్ అవుతానని కొంతమంది ఊహించలేదు. హీరోయిన్‌గా సక్సెస్‌ అందుకున్నాక వాళ్లే నాకు విషెస్‌ చెప్పారు. అందుకు ఎంతో సంతోషించా’ అని ఓ సందర్భంలో సంయుక్త అన్నారు.

10/17
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ.. నటిగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.

11/17
సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో సంయుక్తకు అధికారిక ఖాతాలు ఉన్నాయి. అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ఆమె ఎక్కువగా ఇన్‌స్టా ఉపయోగిస్తుంటారు.

12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని