Highline Meeting: ఎత్తయిన పర్వతాల మధ్యలో ఊయల కట్టుకుని సేద తీరుతూ...

స్కై కాంపింగ్‌ (Sky Camping) గురించి తెలుసా? ఎత్తయిన పర్వతాల మధ్యలో పొడవైన తాడుకు ఊయల కట్టి అందులో పడుకుని సేదతీరుతుంటారు. ఆ డేరింగ్‌ ఫీట్‌ ఫొటోలు కొన్ని మీకోసం. 

Updated : 19 May 2024 16:05 IST
1/7
ఎత్తయిన పర్వతాల మధ్యలో పొడవైన తాడుకు ఊయల కట్టి అందులో పడుకుంటే ఎలా ఉంటుంది... బాబోయ్‌ ఆ ఊహే కడుపులో భయం పుట్టిస్తుంది కదూ. 

2/7
నిజంగానే అలా చేసే సాహసికులున్నారు. ఇటలీలోని మాంటీ పియనా పర్వతాల్లో ఇలాంటి ఫీట్‌లు చేస్తుంటారు. 

3/7
‘ఇంటర్నేషనల్‌ హైలైన్‌ మీటింగ్‌’ పేరుతో ఏటా ప్రపంచంలోని డేర్‌డెవిల్స్‌ ఈ స్కైక్యాంపింగ్‌ను ఏర్పాటు చేసుకుంటారు. 

4/7
వందలాది అడుగుల ఎత్తులో, రెండు పర్వతాల నడుమ, పొడవైన తాడు బిగించి, దానికి వరసగా ఉయ్యాలలు కట్టుకుంటారు. 

5/7
అంత ఎత్తుకి ధైర్యంగా చేరుకోవడమే కాదు... అక్కడ నచ్చిన పని చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. 

6/7
కొందరు సరదాగా పాటలు పాడుతూ, గిటారు వాయిస్తుంటారు. మరికొందరు పుస్తకాలు చదువుకుంటారు. 

7/7
 మరి జారిపడితే ఎలా అంటారా... ఆ భయం లేకుండా సేఫ్టీ బెల్టుల్లాంటివి వేసుకుంటారు. 

Tags :

మరిన్ని