Payal rajput: పాయల్‌ రాజ్‌పుత్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’తో తెలుగువారికి పరిచయమయ్యారు నటి పాయల్‌ రాజ్‌పుత్‌. మొదటి సినిమాతోనే సక్సెస్‌ను సొంతం చేసుకున్నారామె. ఇటీవల వరుస పరాజయాలు అందుకున్న పాయల్‌ ప్రస్తుతం ‘మంగళవారం’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పాయల్‌కు సంబంధించిన పలు విశేషాలు మీకోసం..!

Updated : 15 Nov 2023 20:28 IST
1/19
1992 డిసెంబర్‌ 5న దిల్లీలో  పాయల్‌ రాజ్‌పుత్‌ జన్మించారు.

2/19
చిన్నతనం నుంచి ఆమెకు సినిమా పరిశ్రమ అంటే అమితమైన అభిమానం.

3/19
కుటుంబసభ్యులు సైతం ఆమె ఇష్టాన్ని ప్రోత్సహించడంతో సీరియల్‌ ఆర్టిస్ట్‌గా పాయల్‌ కెరీర్‌ మొదలు పెట్టారు.

4/19
2010 నుంచి దాదాపు ఏడేళ్లపాటు ఆమె ఎన్నో ధారావాహికల్లో నటించారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘చన్నా మేరేయా’. పంజాబీ భాషలో తెరకెక్కిన ఈసినిమా పాయల్‌కు విజయాన్ని అందించింది.
 
5/19
‘చన్నా మేరేయా’లో పాయల్‌ నటన చూసి తెలుగు దర్శకుడు అజయ్‌ భూపతి ఫిదా అయ్యారు. తన తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ఆమెకు అవకాశం ఇచ్చారు.

6/19
విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్‌ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.

7/19
‘ఆర్‌ఎక్స్‌ 100’ సక్సెస్‌ తర్వాత పాయల్‌కు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి.

8/19
‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’, ‘వెంకీ మావ’, ‘డిస్కో రాజా’, ‘అనగనగా ఓ అతిథి’, ‘తీస్‌ మార్‌ ఖాన్‌’, ‘జిన్నా’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు.

9/19
తెలుగు, తమిళం, పంజాబీ భాషల్లో వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఆమె అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు.

10/19
తెలుగులో తనకు తొలి విజయాన్ని అందించిన అజయ్‌ భూపతి దర్శకత్వంలో పాయల్‌ నటించిన తాజా చిత్రం ‘మంగళవారం’.

11/19
గ్రామీణ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కోసం పాయల్‌ ఎంతో కష్టపడి వర్క్ చేశారని దర్శకుడు అజయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

12/19
ఈ సినిమాలో పాయల్‌ యాక్టింగ్ చూసి ప్రేక్షకులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటారని దర్శకుడు అన్నారు.

13/19
పాయల్‌కు విరాట్‌ కోహ్లీ అంటే అభిమానం.
పాయల్‌కు విరాట్‌ కోహ్లీ అంటే అభిమానం.
14/19
ప్రభాస్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని.. అవకాశం వస్తే ఆయనకు తన చేతి వంట రుచి చూపిస్తానని ఓ సందర్భంలో ఆమె చెప్పారు.

15/19
విహారయాత్రలు అంటే ఇష్టం. వీలు దొరికినప్పుడు అందమైన ప్రదేశాలకు వెళ్లి వస్తుంటారామె.

16/19
2015 ఫిబ్రవరి 7న ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు ఈ భామ. ఇప్పటివరకూ ఆమెను 4.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

17/19
18/19
19/19

మరిన్ని