Mount Etna volcano : మళ్లీ విస్ఫోటనం చెందిన ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం

ఇటలీలోని సిసిలీలో మంచుతో కప్పబడిన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ విస్ఫోటనం చెందింది. యూరప్‌లో ప్రముఖ అగ్నిపర్వతం ఇది. దీనినుంచి లావా బయటకొస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఫొటోలు..

Updated : 02 Dec 2023 12:39 IST
1/10
ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ‘మౌంట్‌ ఎట్నా’ అగ్నిపర్వతం.. ప్రపంచంలోని అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ‘మౌంట్‌ ఎట్నా’ అగ్నిపర్వతం.. ప్రపంచంలోని అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటి.
2/10
మంచుతో కప్పబడిన ఈ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఏడాదికి ఒకసారైనా విస్ఫోటనంచెందుతుందని అక్కడి స్థానికులు చెబుతారు మంచుతో కప్పబడిన ఈ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఏడాదికి ఒకసారైనా విస్ఫోటనంచెందుతుందని అక్కడి స్థానికులు చెబుతారు
3/10
యూరప్‌లోని అతి ఎత్తైన క్రీయాశీల అగ్నిపర్వతాల్లో ఇదీ ఒకటి.‘మౌంట్‌ ఎట్నా’ ఎత్తు దాదాపు 11 వేల అడుగులు. యూరప్‌లోని అతి ఎత్తైన క్రీయాశీల అగ్నిపర్వతాల్లో ఇదీ ఒకటి.‘మౌంట్‌ ఎట్నా’ ఎత్తు దాదాపు 11 వేల అడుగులు.
4/10
అయితే, విస్ఫోటనంచెందిన ప్రతీసారి ఈ పర్వతంఎత్తు అటుఇటుగా మారుతూ ఉంటుంది. అయితే, విస్ఫోటనంచెందిన ప్రతీసారి ఈ పర్వతంఎత్తు అటుఇటుగా మారుతూ ఉంటుంది.
5/10
ఈ అగ్నిపర్వతం యునెస్కో వారసత్వ జాబితాలో చోటుదక్కించుకోవడం విశేషం. 2013లోనే దీన్ని ఈ జాబితాలో చేర్చారు. ఈ అగ్నిపర్వతం యునెస్కో వారసత్వ జాబితాలో చోటుదక్కించుకోవడం విశేషం. 2013లోనే దీన్ని ఈ జాబితాలో చేర్చారు.
6/10
‘ఎట్నా’ అనే పదం గ్రీకు భాషలోని ‘ఐథో’ నుంచి వచ్చిందని ఒక అభిప్రాయం. దీనికి అర్థం ‘నేను కాల్చేస్తాను’ అని. స్థానికులు మొంగిబెల్లో అని కూడా పిలుస్తుంటారు. ‘ఎట్నా’ అనే పదం గ్రీకు భాషలోని ‘ఐథో’ నుంచి వచ్చిందని ఒక అభిప్రాయం. దీనికి అర్థం ‘నేను కాల్చేస్తాను’ అని. స్థానికులు మొంగిబెల్లో అని కూడా పిలుస్తుంటారు.
7/10
ఎట్నా పర్వతం ఏటా సగటున 14 మిమీ (0.55 అంగుళాలు) చొప్పున మధ్యధరా సముద్రం వైపు కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎట్నా పర్వతం ఏటా సగటున 14 మిమీ (0.55 అంగుళాలు) చొప్పున మధ్యధరా సముద్రం వైపు కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
8/10
‘మౌంట్‌ ఎట్నా’ ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఏటా వేలాది మంది దీన్ని సందర్శిస్తుంటారు. ‘మౌంట్‌ ఎట్నా’ ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఏటా వేలాది మంది దీన్ని సందర్శిస్తుంటారు.
9/10
ఈ అగ్నిపర్వతానికి ప్రధానంగా ఐదు బిలాలు ఉన్నాయి. 1669లో సంభవించిన భారీ విస్ఫోటనంకారణంగా 20 వేల మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ అగ్నిపర్వతానికి ప్రధానంగా ఐదు బిలాలు ఉన్నాయి. 1669లో సంభవించిన భారీ విస్ఫోటనంకారణంగా 20 వేల మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
10/10
శతాబ్దాలుగా ఉబికివచ్చిన లావాతో అగ్నిపర్వతం చుట్టూ సారవంత నేల ఏర్పడింది. నిమ్మజాతి ఫలాలు, ద్రాక్ష మొదలు కూరగాయల వరకు అనేక పంటలు సాగు చేస్తారు. శతాబ్దాలుగా ఉబికివచ్చిన లావాతో అగ్నిపర్వతం చుట్టూ సారవంత నేల ఏర్పడింది. నిమ్మజాతి ఫలాలు, ద్రాక్ష మొదలు కూరగాయల వరకు అనేక పంటలు సాగు చేస్తారు.

మరిన్ని