News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (25-01-2023)

Updated : 25 Jan 2023 21:09 IST
1/24
కరీంనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
2/24
నాంపల్లి నుమాయిష్‌లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంటలు ఎలా ఆర్పాలి, అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వాళ్లను ఎలా కాపాడాలి అనే అంశంపై అగ్నిమాపక సిబ్బంది బుధవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. నాంపల్లి నుమాయిష్‌లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంటలు ఎలా ఆర్పాలి, అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వాళ్లను ఎలా కాపాడాలి అనే అంశంపై అగ్నిమాపక సిబ్బంది బుధవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు.
3/24
గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మువ్వన్నెల విద్యుత్తు కాంతులతో సిద్ధమైన కాచిగూడ రైల్వే స్టేషన్‌ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మువ్వన్నెల విద్యుత్తు కాంతులతో సిద్ధమైన కాచిగూడ రైల్వే స్టేషన్‌
4/24
విద్యుద్దీపకాంతులతో వెలిగిపోతున్న అసెంబ్లీ భవనం విద్యుద్దీపకాంతులతో వెలిగిపోతున్న అసెంబ్లీ భవనం
5/24
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి హైదరాబాద్‌లోని అంబర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ కౌషిద్దీన్. ఆలోచింపజేసే సందేశాలను తన ద్విచక్రవాహనంపై రాసుకొని తిరుగుతూ సికింద్రాబాద్ ప్రాంతంలో కనిపించాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి హైదరాబాద్‌లోని అంబర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ కౌషిద్దీన్. ఆలోచింపజేసే సందేశాలను తన ద్విచక్రవాహనంపై రాసుకొని తిరుగుతూ సికింద్రాబాద్ ప్రాంతంలో కనిపించాడు.
6/24
హైదరాబాద్‌లో ఫిబ్రవరి 26న మాస్ట్రో ఇళయరాజా సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 26న మాస్ట్రో ఇళయరాజా సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.
7/24
అజ్మీర్ దర్గాకు సమర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్‌ను పంపించారు. బుధవారం ప్రగతి భవన్‌లో ముస్లిం మతపెద్దల సమక్షంలో ప్రార్థనల అనంతరం చాదర్‌ను అజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు వక్ఫ్ బోర్డు అధికారులకు అందజేశారు. అజ్మీర్ దర్గాకు సమర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్‌ను పంపించారు. బుధవారం ప్రగతి భవన్‌లో ముస్లిం మతపెద్దల సమక్షంలో ప్రార్థనల అనంతరం చాదర్‌ను అజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు వక్ఫ్ బోర్డు అధికారులకు అందజేశారు.
8/24
చిరంజీవి హీరోగా కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న హనుమకొండలోని సుబేదారిలో ‘వీరయ్య విజయ విహారం’ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. చిరంజీవి హీరోగా కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న హనుమకొండలోని సుబేదారిలో ‘వీరయ్య విజయ విహారం’ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
9/24
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నీరూస్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు మోడల్స్‌ హాజరై నూతన డిజైనర్‌ దుస్తులతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నీరూస్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు మోడల్స్‌ హాజరై నూతన డిజైనర్‌ దుస్తులతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
10/24
గణతంత్ర దినోత్సవం సమీపించిన నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు మువ్వన్నెల రంగుల దుస్తులు ధరించి మురిసిపోయారు. గణతంత్ర దినోత్సవం సమీపించిన నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు మువ్వన్నెల రంగుల దుస్తులు ధరించి మురిసిపోయారు.
11/24
జర్మనీలోని ఫెల్డ్‌బర్గ్‌ పర్వత శిఖరంపై దట్టంగా మంచు కురిసింది. దీనికితోడు చుట్టుపక్కల పొగమంచు మేఘాల మాదిరిగా పరుచుకొని ఉంది. సూర్యోదయం వేళ ఈ దృశ్యం ఎంతో రమణీయంగా కనిపించింది. జర్మనీలోని ఫెల్డ్‌బర్గ్‌ పర్వత శిఖరంపై దట్టంగా మంచు కురిసింది. దీనికితోడు చుట్టుపక్కల పొగమంచు మేఘాల మాదిరిగా పరుచుకొని ఉంది. సూర్యోదయం వేళ ఈ దృశ్యం ఎంతో రమణీయంగా కనిపించింది.
12/24
తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన ‘యువనేస్తం’ నిరుద్యోగ భృతి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. నిరుద్యోగ యువతకు భృతిని అందించాలని కోరుతూ గుంటూరు గుజ్జనగుండ్ల నుంచి జిల్లా ఉపాధి కార్యాలయం వరకు గేదెలతో నిరసన ప్రదర్శన చేశారు. ఉద్యోగాల్లేక చదువుకున్న యువత గేదెలు కాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన ‘యువనేస్తం’ నిరుద్యోగ భృతి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. నిరుద్యోగ యువతకు భృతిని అందించాలని కోరుతూ గుంటూరు గుజ్జనగుండ్ల నుంచి జిల్లా ఉపాధి కార్యాలయం వరకు గేదెలతో నిరసన ప్రదర్శన చేశారు. ఉద్యోగాల్లేక చదువుకున్న యువత గేదెలు కాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు.
13/24
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జనవరి 27న కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. మామ బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జనవరి 27న కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. మామ బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నారు.
14/24
అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లోకేశ్‌ నివాళి అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లోకేశ్‌ నివాళి అర్పించారు.
15/24
హైదరాబాద్‌ రామాంతాపూర్‌లోని మేఘ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నృత్య ప్రదర్శనలతో పాటు ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ రామాంతాపూర్‌లోని మేఘ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నృత్య ప్రదర్శనలతో పాటు ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.
16/24
ర్యాంప్‌వాక్‌లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థినులు ర్యాంప్‌వాక్‌లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థినులు
17/24
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఆదివాసీలు ఆలయంలో సంప్రదాయ బేతల్ పూజలను నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఆదివాసీలు ఆలయంలో సంప్రదాయ బేతల్ పూజలను నిర్వహించారు.
18/24
విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారసుడు’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందమంతా కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకుంది. విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారసుడు’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందమంతా కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకుంది.
19/24
20/24
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తన వారాహి వాహనానికి అక్కడ పూజలు చేయించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తన వారాహి వాహనానికి అక్కడ పూజలు చేయించారు.
21/24
కరీంనగర్‌లో బుధవారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులు, యువత పాల్గొని భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. కరీంనగర్‌లో బుధవారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులు, యువత పాల్గొని భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు.
22/24
కరీంనగర్‌లో మార్వాడీలు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తలపై టెంకాయలు పెట్టుకొని భగవంతుడి నామస్మరణ చేశారు. కరీంనగర్‌లో మార్వాడీలు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తలపై టెంకాయలు పెట్టుకొని భగవంతుడి నామస్మరణ చేశారు.
23/24
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం 165 పశు అంబులెన్స్‌ వాహనాలను తన క్యాంపు ఆఫీస్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం 165 పశు అంబులెన్స్‌ వాహనాలను తన క్యాంపు ఆఫీస్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు.
24/24
జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని అలిపిరి నుంచి ఎస్వీ యూనివర్సిటీ వరకు 3కె రన్ నిర్వహించారు. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని అలిపిరి నుంచి ఎస్వీ యూనివర్సిటీ వరకు 3కె రన్ నిర్వహించారు. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని