News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (22-03-2023)

Updated : 22 Mar 2023 10:58 IST
1/12
గాజుంకొల్లివలసలోని సంగమేశ్వరస్వామి కొండ వద్ద శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. శోభకృత్‌ నామ నూతన సంవత్సరంలో  ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సైకత శిల్పంతో ఉగాది శుభకాంక్షలు తెలియజేశారు. గాజుంకొల్లివలసలోని సంగమేశ్వరస్వామి కొండ వద్ద శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. శోభకృత్‌ నామ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సైకత శిల్పంతో ఉగాది శుభకాంక్షలు తెలియజేశారు.
2/12
అదొక పువ్వు ఎప్పటిదో తెలుసా? 3.3 కోట్ల ఏళ్ల క్రితం నాటిది. శిలాజంగా మారిన జిగురులో చెక్కు చెదరకుండా ఇంకా భద్రంగా ఉంది. అందుకే దీన్ని అతిపెద్ద శిలాజ పువ్వుగా భావిస్తున్నారు. ఇది అడ్డంగా 28 మి.మీ. ఉంటుంది. ఉత్తర యూరప్‌లోని బాల్టిక్‌ అడవుల్లో బయటపడ్డ ఇది స్టీవార్టియా కోవాలీవ్‌స్కీ అనే పురాతన సతత హరిత మొక్కకు చెందిందని భావిస్తున్నారు. అదొక పువ్వు ఎప్పటిదో తెలుసా? 3.3 కోట్ల ఏళ్ల క్రితం నాటిది. శిలాజంగా మారిన జిగురులో చెక్కు చెదరకుండా ఇంకా భద్రంగా ఉంది. అందుకే దీన్ని అతిపెద్ద శిలాజ పువ్వుగా భావిస్తున్నారు. ఇది అడ్డంగా 28 మి.మీ. ఉంటుంది. ఉత్తర యూరప్‌లోని బాల్టిక్‌ అడవుల్లో బయటపడ్డ ఇది స్టీవార్టియా కోవాలీవ్‌స్కీ అనే పురాతన సతత హరిత మొక్కకు చెందిందని భావిస్తున్నారు.
3/12
ఉగాది పండుగ సందర్భంగా పట్టణాల్లో, గ్రామాల్లో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీ, పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ ఆలయాల చుట్టూ తిపుతుంటారు. ఏటా వందలాదిగా కనిపించే బండ్లు ట్రాక్టర్ల వాడకం పెరగడంతో తగ్గిపోతున్నాయి. ఈసారి యువత ఆయా సంఘాల ప్రతినిధులు ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఉగాది పండుగ సందర్భంగా పట్టణాల్లో, గ్రామాల్లో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీ, పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ ఆలయాల చుట్టూ తిపుతుంటారు. ఏటా వందలాదిగా కనిపించే బండ్లు ట్రాక్టర్ల వాడకం పెరగడంతో తగ్గిపోతున్నాయి. ఈసారి యువత ఆయా సంఘాల ప్రతినిధులు ప్రదర్శనకు సిద్ధమయ్యారు.
4/12
కంప్యూటర్‌ యుగంలో పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. వాటి సంరక్షణకు కొద్ది సమయం కేటాయిస్తున్నారు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు. ఉట్నూరు మండలం ఘన్‌పూర్‌లో తన ఇంటి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిచ్చుకలు కనిపించాయి. వాటిని సంరక్షించాలనే ఆలోచనతో ఇంటి ముందు భాగంలో డబ్బాలతో గూళ్లు తయారు చేశాడు. అవి ఆ గూళ్లతో పాటు ఇంట్లో కూడా గడ్డి పోచలతో గూళ్లు తయారు చేసుకుని జీవిస్తున్నాయి. కంప్యూటర్‌ యుగంలో పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. వాటి సంరక్షణకు కొద్ది సమయం కేటాయిస్తున్నారు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు. ఉట్నూరు మండలం ఘన్‌పూర్‌లో తన ఇంటి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిచ్చుకలు కనిపించాయి. వాటిని సంరక్షించాలనే ఆలోచనతో ఇంటి ముందు భాగంలో డబ్బాలతో గూళ్లు తయారు చేశాడు. అవి ఆ గూళ్లతో పాటు ఇంట్లో కూడా గడ్డి పోచలతో గూళ్లు తయారు చేసుకుని జీవిస్తున్నాయి.
5/12
తెలుగు సంవత్సరాది సందర్భంగా చేసే ఉగాది పచ్చడికి  జిల్లాలో ఈసారి వేప పువ్వు కరవయింది. ఉగాది నాటికి ఆకులన్నీ రాలి కొత్త చిగుళ్లు వచ్చి, నిండుగా పూత పూయాల్సిన వేపచెట్లు వైరస్ కారణంగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని చెట్లకు చిగురు వచ్చినా చాలా చెట్లకు పూతరాలేదు. తెగులు సోకిన చెట్ల పూతను వాడటానికి కూడా ప్రజలు జంకుతున్నారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా చేసే ఉగాది పచ్చడికి జిల్లాలో ఈసారి వేప పువ్వు కరవయింది. ఉగాది నాటికి ఆకులన్నీ రాలి కొత్త చిగుళ్లు వచ్చి, నిండుగా పూత పూయాల్సిన వేపచెట్లు వైరస్ కారణంగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని చెట్లకు చిగురు వచ్చినా చాలా చెట్లకు పూతరాలేదు. తెగులు సోకిన చెట్ల పూతను వాడటానికి కూడా ప్రజలు జంకుతున్నారు.
6/12
మంచు కురుస్తుంటే అందరికీ ఆనందమే. సర్వ సాధారణంగా శీతకాలంలో కనిపించే మంచు వేసవిలోనూ ఆహ్లాదాన్ని అందిస్తోంది. మంగళవారం ఉదయం చేగుంటలో పొగమంచు పూర్తిగా కమ్మేసింది. మంచు కురుస్తుంటే అందరికీ ఆనందమే. సర్వ సాధారణంగా శీతకాలంలో కనిపించే మంచు వేసవిలోనూ ఆహ్లాదాన్ని అందిస్తోంది. మంగళవారం ఉదయం చేగుంటలో పొగమంచు పూర్తిగా కమ్మేసింది.
7/12
తెలుగు సంవత్సరంలో మొదటి పండుగ ఉగాది. ఈ రోజు షడ్రుచులతో చేసిన పచ్చడి తినడం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం. తీపి, వగరు, కారం, ఉప్పు, చేదు, పులుపు వంటి ఆరు రుచుల మిశ్రమంలాగే మనిషి జీవితంలో కష్టసుఖాలను సమానంగా పంచుకోవాలని పెద్దలు అంటుంటారు. ఈ ఏడాదంతా సర్వ శుభాలకు వారధిగా నిలవాలని శోభకృత్‌ నామ సంవత్సరానికి మనసారా స్వాగతం పలుకుదాం. తెలుగు సంవత్సరంలో మొదటి పండుగ ఉగాది. ఈ రోజు షడ్రుచులతో చేసిన పచ్చడి తినడం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం. తీపి, వగరు, కారం, ఉప్పు, చేదు, పులుపు వంటి ఆరు రుచుల మిశ్రమంలాగే మనిషి జీవితంలో కష్టసుఖాలను సమానంగా పంచుకోవాలని పెద్దలు అంటుంటారు. ఈ ఏడాదంతా సర్వ శుభాలకు వారధిగా నిలవాలని శోభకృత్‌ నామ సంవత్సరానికి మనసారా స్వాగతం పలుకుదాం.
8/12
వేసవికాలం ప్రారంభమైంది. మూగ జీవాలు, పశు పక్ష్యాదులు దాహానికి అల్లాడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో మంగళవారం ఒక కోతి నీరు కోసం అల్లాడింది, పరుగులు తీస్తూ ఒక ఇంటి వద్దకు చేరింది. అక్కడ గ్లాసులో ఉంచిన నీటిని తాగుతుండగా కింద పడిపోయాయి. ఆ గోడపై ఉన్న నీటిని తాగింది. వేసవికాలం ప్రారంభమైంది. మూగ జీవాలు, పశు పక్ష్యాదులు దాహానికి అల్లాడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో మంగళవారం ఒక కోతి నీరు కోసం అల్లాడింది, పరుగులు తీస్తూ ఒక ఇంటి వద్దకు చేరింది. అక్కడ గ్లాసులో ఉంచిన నీటిని తాగుతుండగా కింద పడిపోయాయి. ఆ గోడపై ఉన్న నీటిని తాగింది.
9/12
తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకకు సిద్ధమైంది భాగ్యనగరం. షడ్రుచుల పచ్చడి.. సంప్రదాయ వస్త్రధారణ.. కలగలిపిన స్వచ్ఛమైన అచ్చ తెలుగు పండగ. ఈ నేపథ్యంలో మామిడాకులు, పూలు ఇతర వస్తువుల కొనుగోళ్లతో మంగళవారం సాయంత్రం మార్కెట్లు కిటకిటలాడాయి. తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకకు సిద్ధమైంది భాగ్యనగరం. షడ్రుచుల పచ్చడి.. సంప్రదాయ వస్త్రధారణ.. కలగలిపిన స్వచ్ఛమైన అచ్చ తెలుగు పండగ. ఈ నేపథ్యంలో మామిడాకులు, పూలు ఇతర వస్తువుల కొనుగోళ్లతో మంగళవారం సాయంత్రం మార్కెట్లు కిటకిటలాడాయి.
10/12
చెట్ల కొమ్మలు తొలగించినా.. మొదలు భాగంలో గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాసి ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏపీలోని శ్రీసత్యసాయిజిల్లా తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామంలో సురేశ్‌ అనే రైతు పది ఎకరాల మామిడి తోటలో చెట్లు బాగా పెరగాలని గత ఏడాది కొమ్మలను నరికివేయించారు. చెట్లు ఏపుగా పెరగడంతో పాటు పరిమాణం బాగుంటుందని ఇలా చేశారు. కొమ్మలను తొలగించిన మొదలులో 50 నుంచి 60 వరకు కాయలు కాశాయి. చెట్ల కొమ్మలు తొలగించినా.. మొదలు భాగంలో గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాసి ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏపీలోని శ్రీసత్యసాయిజిల్లా తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామంలో సురేశ్‌ అనే రైతు పది ఎకరాల మామిడి తోటలో చెట్లు బాగా పెరగాలని గత ఏడాది కొమ్మలను నరికివేయించారు. చెట్లు ఏపుగా పెరగడంతో పాటు పరిమాణం బాగుంటుందని ఇలా చేశారు. కొమ్మలను తొలగించిన మొదలులో 50 నుంచి 60 వరకు కాయలు కాశాయి.
11/12
అవును.. ఈ మొక్క ధర చూస్తే ‘మొక్కే బంగాయమాయే’ అనిపిస్తుంది. దాని పూలు మాత్రం బంగారు వర్ణంలో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గోల్డ్‌ చైన్‌గా పిలిచే ఈ మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కనిపించాయి. బుర్రిలంకలోని ఓ నర్సరీ నిర్వాహకుడు థాయిలాండ్‌ నుంచి నీటిని తెప్పించి స్థానికంగా అభివృద్ధి చేశారు. 6 నుంచి 7 అడుగుల ఎత్తు పెరిగిన మొక్క అడుగున్నర పొడవు బంగారు వర్ణంలో పూలు పూస్తోంది. అవును.. ఈ మొక్క ధర చూస్తే ‘మొక్కే బంగాయమాయే’ అనిపిస్తుంది. దాని పూలు మాత్రం బంగారు వర్ణంలో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గోల్డ్‌ చైన్‌గా పిలిచే ఈ మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కనిపించాయి. బుర్రిలంకలోని ఓ నర్సరీ నిర్వాహకుడు థాయిలాండ్‌ నుంచి నీటిని తెప్పించి స్థానికంగా అభివృద్ధి చేశారు. 6 నుంచి 7 అడుగుల ఎత్తు పెరిగిన మొక్క అడుగున్నర పొడవు బంగారు వర్ణంలో పూలు పూస్తోంది.
12/12
అమీర్‌ కుమ్మరి బస్తీలో కొత్త కుండను పరిశీలిస్తున్న యువతి. అమీర్‌ కుమ్మరి బస్తీలో కొత్త కుండను పరిశీలిస్తున్న యువతి.

మరిన్ని