News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(30-03-2023)

Updated : 30 Mar 2023 05:27 IST
1/14
నెల్లూరు  జిల్లాలోని యాచవరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఎ.రాముఆచారి పెన్సిల్‌పై చెక్కతో తీర్చిదిద్దిన సీతారామాంజనేయ లక్ష్మణ ప్రతిమలను బుధవారం ప్రదర్శించారు. వారంపాటు శ్రమించి కొయ్య ముక్కలతో సుమారు 1.5సెం.మీ. వెడల్పు, 5 సెం.మీ. ఎత్తు ఉన్న ప్రతిమలను చెక్కి పెన్సిల్‌పై అమర్చారు. 

2/14
  అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని  చింతపల్లిలో బుధవారం మధ్యాహ్నం రంగుల హరివిల్లు కనువిందు చేసింది. మధ్నాహ్నం వరకు భానుడి ప్రతాపం కనిపించిన చింతపల్లిలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా భిన్నంగా మారిపోయింది. కారుమబ్బులు కమ్ముకున్నాయి. చిరుజల్లులు, ఈదురుగాలులు వీచాయి. వర్షం వెలసిన తరువాత బాలాజీపేట సమీపంలోని కొండపై రంగుల హరివిల్లు కొద్దిసేపు కనువిందు చేసింది.

3/14
   శ్రీరామనవమి సందర్భంగా విశాఖపట్నం  జిల్లా  గోపాలపట్నంలోని 89వ వార్డు ఎల్లపువానిపాలెంలో బుధవారం సాయంత్రం సీతమ్మతల్లి సారె ఊరేగింపు నిర్వహించారు. బాజాభజంత్రీలు, బాణసంచా కాల్పుల మధ్య వివిధ రకాల పిండి వంటలు, పండ్లను పురవీధుల్లో ఊరేగించి.. నైవేద్యంగా సమర్పించారు. 

4/14
 విద్యార్థుల చదువులకు ఎన్నెన్నో ఆటంకాలు. ఒంటి పూట బడులకు పొద్దున్నే వచ్చిన విద్యార్థులు తిరిగి వెళ్లడానికి ప్రయాణానికి తిప్పలు పడుతున్నారు. రోడ్లపై బస్సుల కోసం చూడాల్సి వస్తోంది. సిద్దిపేట గ్రామీణ మండలం ఇర్కోడు ఆదర్శ పాఠశాల విద్యార్థులు మిట్టమధ్యాహ్నం వృక్షం నీడన బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.

5/14
  ఈ చిత్రంలోని కల్వర్టు నిజామాబాద్‌  జిల్లాలోని  నిజామాబాద్‌ - బాన్సువాడ రహదారిపై మల్లారం అటవీ ప్రాంతంలో ఉంది. దీనికి ఇరువైపులా రక్షణ గోడలు కూలిపోయి రోడ్డుకు సమాంతరంగా మారిపోయింది. వాహనదారులు దగ్గరికి వచ్చే వరకు   కల్వర్టు ఉందనే విషయం తెలియడం లేదు. రాత్రి సమయాల్లో వాహనదారులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

6/14
 రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే చెబుతున్నా  వాహనచోదకుల తీరులో మార్పు రావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన ఓ వ్యక్తి  వంట చెరకు కోసం ఎండిపోయిన చెట్టును ద్విచక్రవాహనంపై పెట్టుకొని ఇలా తీసుకెళ్లాడు. ఈ వాహనానికి నెంబర్‌ కూడా లేకపోవడం మరో విశేషం.

7/14
హనుమకొండ నగరంలో డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం కూడలి పేరుగాంచింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఆధ్వర్యంలో ఆధునికీకరించారు. కొత్త అభివృద్ధి పనులతో అంబేడ్కర్‌ కూడలి జిగేలుమంటోంది. వాహనదారులు, పాదచారుల రక్షణ కోసం చుట్టూ రెయిలింగ్, న్యూ ప్లాంటేషన్, ల్యాండ్‌ స్కేపింగ్, ఆకర్షణీయమైన మొక్కలు ఏర్పాటు చేశారు. రాణిరుద్రమ దేవి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వాటర్‌ ఫౌంటేన్, లైట్లు ఏర్పాటు చేశారు.

8/14
ఇంటర్మీడియెట్‌ జనరల్‌ విభాగం విద్యార్థుల పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఒక్కసారిగా పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడంతో.. కేంద్రం బయటకు రాగానే వారు కేరింతలు కొట్టారు. వసతిగృహాల్లో ఉండి చదివిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి స్వస్థలాలకు బయలుదేరారు.

9/14
 ఆదిలాబాద్‌ రేడియో స్టేషన్‌ ఆవరణలోని 328 అడుగుల ఎత్తు కలిగిన ఎఫ్‌ఎమ్‌ టవర్‌ చివరి భాగంలో నలుగురు కార్మికులు మరమ్మతులు చేపడుతున్నారు. కింద నుంచి ఆ టవర్‌ వైపునకు ఎవరైనా చూస్తే చిన్న పక్షులు అటుఇటు కదులుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆ టవర్‌ చివరి భాగంలో పనులు చేస్తున్నారని తెలుసుకున్న వారు వామ్మో పూట గడవడం కోసం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం చాలా గొప్ప అంటూ.. వారిని ప్రశంసించడంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

10/14
  ఆటపాటలు, ర్యాంప్‌వాక్‌తో  విద్యార్థినులు సందడి చేశారు.  హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలోని ఒమేగా మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు.

11/14
 ఇంటర్‌ ద్వితీయ  సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. వీడ్కోలు వేళ  హైదరాబాద్‌లోని  సరూర్‌నగర్, నారాయణగూడ పరీక్ష కేంద్రాల చెంత విద్యార్థినుల సంబరమిది.

12/14
   శ్రీరామ నవమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ నగరం సిద్ధమైంది. గురువారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సీతారాముల కల్యాణోత్సవానికి, తరలివచ్చే భక్తజనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 

13/14
  కాకినాడ సముద్ర తీరం నుంచి సుమారు 20 కి.మీ. దూరంలో ఇండియన్‌ కోస్ట్‌గార్డు ఆధ్వర్యంలో బుధవారం రీజినల్‌ సెర్చ్, రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌(సారెక్స్‌-2023) నిర్వహించారు. కోస్ట్‌గార్డ్‌ కాకినాడ స్టేషన్‌ ఆధ్వర్యంలో సముద్రంలో విపత్తుల స్పందన, నిర్వహణపై నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌ అబ్బురపరిచింది. రిమోట్‌తో పనిచేసే లైఫ్‌ బోట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి

14/14
   జర్మనీలోని డుసెల్డోర్ఫ్‌లో ఇటీవల నిర్వహించిన ‘సైక్లింగ్‌ వరల్డ్‌ బైక్‌ షో’లో ‘క్లైన్‌ జొహన్నా’ అనే సైకిల్‌ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. 2,177 కిలోల బరువుతో బుల్డోజర్‌ పరిమాణంలో ఉన్న దీన్ని తుక్కు దుకాణం నుంచి తెచ్చిన వస్తువులతో తయారు చేశారు.

మరిన్ని