News In Pics: చిత్రం చెప్పే సంగతులు(02-12-2023)

Updated : 02 Dec 2023 03:18 IST
1/12
కృష్ణా: కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణాతరంగ్‌ కార్యక్రమం ఉత్సాహంగా   సాగుతోంది. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కృష్ణా: కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కృష్ణాతరంగ్‌ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
2/12
3/12
విశాఖపట్నం: జిల్లాలో చలి విజృంభిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో శుక్రవారం 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటికి ఇదే రికార్డు అని పేర్కొన్నారు. విశాఖపట్నం: జిల్లాలో చలి విజృంభిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో శుక్రవారం 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటికి ఇదే రికార్డు అని పేర్కొన్నారు.
4/12
కరీంనగర్‌: జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో శుక్రవారం కనిపించిన రద్దీ ఇది. పట్టణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతీయువకులు గురువారం స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుగు ప్రయాణమవడంతో పలు రైల్లు కిటకటలాడాయి.


కరీంనగర్‌: జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో శుక్రవారం కనిపించిన రద్దీ ఇది. పట్టణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతీయువకులు గురువారం స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుగు ప్రయాణమవడంతో పలు రైల్లు కిటకటలాడాయి.
5/12
ఆదిలాబాద్‌: జైనథ్‌ శ్రీలక్ష్మీనారాయణస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. శుక్రవారం రథోత్సవంలో భాగంగా స్వామివారిని లక్ష్మీ సమేతంగా గ్రామంలో ఊరేగించారు. ఆదిలాబాద్‌: జైనథ్‌ శ్రీలక్ష్మీనారాయణస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. శుక్రవారం రథోత్సవంలో భాగంగా స్వామివారిని లక్ష్మీ సమేతంగా గ్రామంలో ఊరేగించారు.
6/12
7/12
హైదరాబాద్‌: మల్లేపల్లి విజయనగర్‌ కాలనీ రోడ్డులో జీహెచ్‌ఎంసీ రోడ్డుకు ఓ వైపు వివిధరకాల తినుబండారాల దుకాణాలు, మరోవైపు కూర్చుని తినేందుకు వీలుగా వసతులు కల్పించింది. అర్హులకు కేటాయించిన విధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఛాట్, టిఫిన్స్, కబాబ్, జ్యూస్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. వీధిలో ఆహారం కాస్తా ఇక్కడ ఆహార వీధిగా మారింది. హైదరాబాద్‌: మల్లేపల్లి విజయనగర్‌ కాలనీ రోడ్డులో జీహెచ్‌ఎంసీ రోడ్డుకు ఓ వైపు వివిధరకాల తినుబండారాల దుకాణాలు, మరోవైపు కూర్చుని తినేందుకు వీలుగా వసతులు కల్పించింది. అర్హులకు కేటాయించిన విధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఛాట్, టిఫిన్స్, కబాబ్, జ్యూస్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. వీధిలో ఆహారం కాస్తా ఇక్కడ ఆహార వీధిగా మారింది.
8/12
9/12
హైదరాబాద్‌: గతంలో ఒకే రంగు విద్యుత్తు దీపాలతో అలంకరణతో కనిపించిన సచివాలయం కొన్ని రోజులుగా వివిధ రంగుల దీపకాంతులతో  ఆకట్టుకుంటోంది. రాత్రివేళ సచివాలయ భవన సోయగం హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో  ప్రతిబింబిస్తూ ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌: గతంలో ఒకే రంగు విద్యుత్తు దీపాలతో అలంకరణతో కనిపించిన సచివాలయం కొన్ని రోజులుగా వివిధ రంగుల దీపకాంతులతో ఆకట్టుకుంటోంది. రాత్రివేళ సచివాలయ భవన సోయగం హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో ప్రతిబింబిస్తూ ఆకర్షిస్తోంది.
10/12
హైదరాబాద్‌: ఉప్పల్‌-  రామంతాపూర్‌ మార్గంలో వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాహనదారులు   తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. హైదరాబాద్‌: ఉప్పల్‌- రామంతాపూర్‌ మార్గంలో వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
11/12
హైదరాబాద్‌:  బంజారాహిల్స్‌ రోడ్డు నం.1లోని లేబుల్స్‌ ది పాప్‌-అప్‌ స్పేస్‌లో ‘స్వాన్‌’ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ వస్త్రాభరణాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. యువతార అవికాగోర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నం.1లోని లేబుల్స్‌ ది పాప్‌-అప్‌ స్పేస్‌లో ‘స్వాన్‌’ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ వస్త్రాభరణాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. యువతార అవికాగోర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
12/12
విశాఖపట్నం రుషికొండ సమీపంలో చినరుషికొండ ప్రాంతంలో చేపట్టిన విస్తరణ పనులో  భాగంగా మార్గంలో భూగర్భ విద్యుత్తు తీగలకు సంబంధించిన పెట్టెలను పక్కకు తరలించకుండానే అధికారులు తారు వేయించారు. విశాఖపట్నం రుషికొండ సమీపంలో చినరుషికొండ ప్రాంతంలో చేపట్టిన విస్తరణ పనులో భాగంగా మార్గంలో భూగర్భ విద్యుత్తు తీగలకు సంబంధించిన పెట్టెలను పక్కకు తరలించకుండానే అధికారులు తారు వేయించారు.

మరిన్ని