News In Pics: చిత్రం చెప్పే సంగతులు(03-12-2023)

Updated : 03 Dec 2023 03:07 IST
1/11
నెల్లూరు: ఇది అల్లూరులోని వ్యవసాయ మార్కెట్‌ గోదాముల ప్రాంగణంలోని ధాన్యం ఆరబోత కేంద్రం.కోతల సమయంలో ఈ ప్రాంత  రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోస్తారు. లోతట్టుగా ఉండడంతో వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో మాగాణిని తలపిస్తోంది. నెల్లూరు: ఇది అల్లూరులోని వ్యవసాయ మార్కెట్‌ గోదాముల ప్రాంగణంలోని ధాన్యం ఆరబోత కేంద్రం.కోతల సమయంలో ఈ ప్రాంత రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోస్తారు. లోతట్టుగా ఉండడంతో వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో మాగాణిని తలపిస్తోంది.
2/11
విశాఖపట్నం: పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వర మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సారె ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. విశాఖపట్నం: పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వర మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సారె ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
3/11
4/11
విశాఖపట్నం: జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. చింతపల్లిలో శనివారం ఉదయం 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. విశాఖపట్నం: జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. చింతపల్లిలో శనివారం ఉదయం 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు.
5/11
హైదరాబాద్‌: నిత్యం రద్దీగా ఉండే సచివాలయం, నెక్లెస్‌ రోడ్డు నుంచి ఖైరతాబాద్‌ వచ్చే దారిలో మ్యాన్‌హోల్‌ ప్రమాదకరంగా ఉంది. రెండు నెలలుగా ఇలా ఓ కర్ర ఏర్పాటు చేసి వదిలేశారు. ఇప్పటికైనా మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. హైదరాబాద్‌: నిత్యం రద్దీగా ఉండే సచివాలయం, నెక్లెస్‌ రోడ్డు నుంచి ఖైరతాబాద్‌ వచ్చే దారిలో మ్యాన్‌హోల్‌ ప్రమాదకరంగా ఉంది. రెండు నెలలుగా ఇలా ఓ కర్ర ఏర్పాటు చేసి వదిలేశారు. ఇప్పటికైనా మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
6/11
హైదరాబాద్‌: తాజ్‌కృష్ణలో ఓ కార్యక్రమానికి హాజరైన సినీతారలు ప్రియాంక చౌదరి, ప్రియా ఇంటూరు శనివారం సందడి చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. హైదరాబాద్‌: తాజ్‌కృష్ణలో ఓ కార్యక్రమానికి హాజరైన సినీతారలు ప్రియాంక చౌదరి, ప్రియా ఇంటూరు శనివారం సందడి చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.
7/11
హైదరాబాద్‌: రాయదుర్గం సత్వా నాలెడ్జ్‌ సిటీ యాంఫీ థియేటర్‌లో శనివారం అమెరికన్‌ కాన్సులేట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ జాజ్‌ ఫెస్టివల్‌ పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. హైదరాబాద్‌: రాయదుర్గం సత్వా నాలెడ్జ్‌ సిటీ యాంఫీ థియేటర్‌లో శనివారం అమెరికన్‌ కాన్సులేట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ జాజ్‌ ఫెస్టివల్‌ పేరుతో సంగీత విభావరి నిర్వహించారు.
8/11
హైదరాబాద్‌: ఉప్పల్‌లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శిల్పారామంలో అర్చన గూటి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. హైదరాబాద్‌: ఉప్పల్‌లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శిల్పారామంలో అర్చన గూటి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది.
9/11
హైదరాబాద్‌: కేపీహెచ్‌బీలో ఓ మాల్‌లో శనివారం నిర్వహించిన ఫ్యాషన్‌ షో అలరించింది. యువతులు ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. 2016 మిస్టర్‌ వరల్డ్‌ రోహిత్‌ కండేల్‌వాల్, మిస్‌ ఇండియా గ్రాండ్‌ 2023 అర్శిన సంబుల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌: కేపీహెచ్‌బీలో ఓ మాల్‌లో శనివారం నిర్వహించిన ఫ్యాషన్‌ షో అలరించింది. యువతులు ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. 2016 మిస్టర్‌ వరల్డ్‌ రోహిత్‌ కండేల్‌వాల్, మిస్‌ ఇండియా గ్రాండ్‌ 2023 అర్శిన సంబుల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
10/11
11/11
జర్మనీలోని మ్యూనిక్‌లో భారీ హిమపాతం కారణంగాకార్లపై దట్టంగా పేరుకుపోయిన మంచు. జర్మనీలోని మ్యూనిక్‌లో భారీ హిమపాతం కారణంగాకార్లపై దట్టంగా పేరుకుపోయిన మంచు.

మరిన్ని