News In Pics: చిత్రం చెప్పే సంగతులు(06-12-2023)

Updated : 06 Dec 2023 03:31 IST
1/10
హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో లకోటియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థ ‘ఎవాల్వ్‌’ పేరుతో కిడ్స్‌ ఫ్యాషన్‌ షో నిర్వహించింది. చిన్నారులతో పాటు దుస్తులు రూపొందించిన విద్యార్థులు ర్యాంప్‌పై అడుగులు వేస్తూ అలరించారు. హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో లకోటియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థ ‘ఎవాల్వ్‌’ పేరుతో కిడ్స్‌ ఫ్యాషన్‌ షో నిర్వహించింది. చిన్నారులతో పాటు దుస్తులు రూపొందించిన విద్యార్థులు ర్యాంప్‌పై అడుగులు వేస్తూ అలరించారు.
2/10
హైదరాబాద్‌: తుపాను కారణంగా నగరంలో మంగళవారం అక్కడక్కడ చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బు పట్టి  వాతావరణం చల్లగా మారింది. హైదరాబాద్‌: తుపాను కారణంగా నగరంలో మంగళవారం అక్కడక్కడ చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బు పట్టి వాతావరణం చల్లగా మారింది.
3/10
4/10
హైదరాబాద్‌: బాలాపూర్‌ రహదారిలో ఓ వాహన దారుడు వైవిధ్యంగా ఉండాలని హెల్మెట్‌పై బొమ్మను అలంకరించాడు. దీంతో ప్రయాణికులు అందరూ ఈ వాహనదారుడి శిరస్త్రాణాన్ని చూస్తున్నారు. హైదరాబాద్‌: బాలాపూర్‌ రహదారిలో ఓ వాహన దారుడు వైవిధ్యంగా ఉండాలని హెల్మెట్‌పై బొమ్మను అలంకరించాడు. దీంతో ప్రయాణికులు అందరూ ఈ వాహనదారుడి శిరస్త్రాణాన్ని చూస్తున్నారు.
5/10
హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి 18 కలశాలతో పడిపూజ మహోత్సవం జరిగింది. అయ్యప్పస్వామి పాటలు, భజనతో భక్తులు అలరించారు. హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి 18 కలశాలతో పడిపూజ మహోత్సవం జరిగింది. అయ్యప్పస్వామి పాటలు, భజనతో భక్తులు అలరించారు.
6/10
కడప: గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులోని జలపాతం ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు తమ వాహనాలను ఆపి చరవాణుల్లో ఫొటోలు తీసుకుంటున్నారు. కడప: గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులోని జలపాతం ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు తమ వాహనాలను ఆపి చరవాణుల్లో ఫొటోలు తీసుకుంటున్నారు.
7/10
నెల్లూరు: నాలుగు రోజుల తర్వాత సూర్యుడు దర్శనమిచ్చాడు. మిగ్‌జాం తుపాను నెల్లూరులో తీవ్ర ప్రభావం చూపింది మంగళవారం సాయంత్రం ఇంద్ర]ధనస్సుతో పాటు సూర్యుడు కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసి నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు: నాలుగు రోజుల తర్వాత సూర్యుడు దర్శనమిచ్చాడు. మిగ్‌జాం తుపాను నెల్లూరులో తీవ్ర ప్రభావం చూపింది మంగళవారం సాయంత్రం ఇంద్ర]ధనస్సుతో పాటు సూర్యుడు కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసి నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
8/10
నెల్లూరు: ఉదయగిరి దుర్గం కొండపై పచ్చని చెట్లు, రాతి పొరల మధ్య నుంచి జాలువారే సల్వపేట్‌ జలపాతం చూపరులను కనువిందు చేస్తోంది.ఈ దృశ్యాన్ని తిలకించేందుకు దుర్గం కొండ వద్దకు సందర్శకులు మంగళవారం అధిక సంఖ్యలో తరలి వెళ్లడంతో సందడి నెలకొంది. నెల్లూరు: ఉదయగిరి దుర్గం కొండపై పచ్చని చెట్లు, రాతి పొరల మధ్య నుంచి జాలువారే సల్వపేట్‌ జలపాతం చూపరులను కనువిందు చేస్తోంది.ఈ దృశ్యాన్ని తిలకించేందుకు దుర్గం కొండ వద్దకు సందర్శకులు మంగళవారం అధిక సంఖ్యలో తరలి వెళ్లడంతో సందడి నెలకొంది.
9/10
విశాఖపట్నం: దిమిలిలో బురదమాంబ పండగను మంగళవారం వైభవంగా నిర్వహించారు. యువకులు, పెద్దలు బురదను పులుముకుని సందడి చేశారు. తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు కొఠారు దల్లమ్మదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖపట్నం: దిమిలిలో బురదమాంబ పండగను మంగళవారం వైభవంగా నిర్వహించారు. యువకులు, పెద్దలు బురదను పులుముకుని సందడి చేశారు. తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు కొఠారు దల్లమ్మదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.
10/10
మెదక్‌: వరాహాలు, శునకాల మధ్య సహజ వైరం ఉంటుంది. వరాహాలు కనిపిస్తే శునకాలు వెంటాడుతుంటాయి. చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్‌రోడ్డు వద్ద జాతి వైరాన్ని మరిచి పందితో కలిసి మూడు కుక్కలు ఒకేచోట ఒదిగి పడుకున్నాయి. అటువైపుగా వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి. మెదక్‌: వరాహాలు, శునకాల మధ్య సహజ వైరం ఉంటుంది. వరాహాలు కనిపిస్తే శునకాలు వెంటాడుతుంటాయి. చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్‌రోడ్డు వద్ద జాతి వైరాన్ని మరిచి పందితో కలిసి మూడు కుక్కలు ఒకేచోట ఒదిగి పడుకున్నాయి. అటువైపుగా వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి.

మరిన్ని