News In Pics: చిత్రం చెప్పే సంగతులు(07-12-2023)

Updated : 07 Dec 2023 05:57 IST
1/13
హైదరాబాద్‌: కార్తిక మాసం సందర్భంగా బోరబండ స్వరాజ్యనగర్‌ హరిహర క్షేత్రంలో శివలింగం ఆకారంలో భక్తులు దీపాలు వెలిగించారు. హైదరాబాద్‌: కార్తిక మాసం సందర్భంగా బోరబండ స్వరాజ్యనగర్‌ హరిహర క్షేత్రంలో శివలింగం ఆకారంలో భక్తులు దీపాలు వెలిగించారు.
2/13
హైదరాబాద్‌: సరికొత్త చరిత్రకు ఎల్బీస్టేడియం వేదిక  కాబోతోంది. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం  చేయనున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌: సరికొత్త చరిత్రకు ఎల్బీస్టేడియం వేదిక కాబోతోంది. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
3/13
4/13
హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో బుధవారం పరిస్థితి ఇది. నిత్యం వేలాది వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ట్రాఫిక్‌ విభాగం ఎన్ని వ్యూహరచనలు చేసినా రద్దీ వేళల్లో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. ఒలిఫెంటా బ్రిడ్జి కూడలి వద్ద, రేతిఫైల్‌ బస్టాండ్‌ పరిసరాల్లో రోజూ ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ అవస్థలు తప్పడం లేదు. హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో బుధవారం పరిస్థితి ఇది. నిత్యం వేలాది వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ట్రాఫిక్‌ విభాగం ఎన్ని వ్యూహరచనలు చేసినా రద్దీ వేళల్లో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. ఒలిఫెంటా బ్రిడ్జి కూడలి వద్ద, రేతిఫైల్‌ బస్టాండ్‌ పరిసరాల్లో రోజూ ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ అవస్థలు తప్పడం లేదు.
5/13
హైదరాబాద్‌: కార్తికమాసం ప్రత్యేక పూజలు ఆలయాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం బాలానగర్‌ సాయినగర్‌లోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయంలో వెన్నపూసతో చేసిన అలంకరణలో శివలింగం భక్తులకు దర్శనమిచ్చింది. హైదరాబాద్‌: కార్తికమాసం ప్రత్యేక పూజలు ఆలయాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం బాలానగర్‌ సాయినగర్‌లోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయంలో వెన్నపూసతో చేసిన అలంకరణలో శివలింగం భక్తులకు దర్శనమిచ్చింది.
6/13
హైదరాబాద్‌: ఎదులాబాద్‌ రంగనాయకస్వామి ఆలయం సమీపంలో ఉన్న జలాశయం, రహదారిపై ఆవరించిన పొగమంచు చూపరులను ఆకర్షిస్తోంది. పనులకు వెళ్లే రైతులు, ఉదయం నడకకు వెళ్లిన వారు మురిసిపోతున్నారు. హైదరాబాద్‌: ఎదులాబాద్‌ రంగనాయకస్వామి ఆలయం సమీపంలో ఉన్న జలాశయం, రహదారిపై ఆవరించిన పొగమంచు చూపరులను ఆకర్షిస్తోంది. పనులకు వెళ్లే రైతులు, ఉదయం నడకకు వెళ్లిన వారు మురిసిపోతున్నారు.
7/13
చిత్తూరు: తిరుమల క్షేత్రపాలకుడైన శివుని అభిషేకం కోసమే కురిసినట్లు వర్షపు నీటితో తిరుమల శేషాచలం అటవీప్రాంతం అలరారుతోంది.పలుప్రాంతాల్లో కరుస్తున్న వర్షంతో జలపాతాలు అలరిస్తున్నాయి. చిత్తూరు: తిరుమల క్షేత్రపాలకుడైన శివుని అభిషేకం కోసమే కురిసినట్లు వర్షపు నీటితో తిరుమల శేషాచలం అటవీప్రాంతం అలరారుతోంది.పలుప్రాంతాల్లో కరుస్తున్న వర్షంతో జలపాతాలు అలరిస్తున్నాయి.
8/13
నెల్లూరు: ముంబయి జాతీయ రహదారిపై బుధవారం పొడవైన ట్రాలీపై ఠీవీగా వెళుతున్న బోటును ఆసక్తిగా తిలకించిన ప్రజలు. కృష్ణపట్నం నుంచి గుజరాత్‌ రాష్ట్రానికి పర్యాటకం కోసం తరలిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు: ముంబయి జాతీయ రహదారిపై బుధవారం పొడవైన ట్రాలీపై ఠీవీగా వెళుతున్న బోటును ఆసక్తిగా తిలకించిన ప్రజలు. కృష్ణపట్నం నుంచి గుజరాత్‌ రాష్ట్రానికి పర్యాటకం కోసం తరలిస్తున్నట్లు తెలిపారు.
9/13
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరానికి చెందిన బాలాజీ వరప్రసాద్‌ పోటీలో పాల్గొని అయిదు రోజుల పాటు ఎకో టూరిజం, మహిళా సాధికారత, అతిథి దేవోభవ తదితర సందేశాత్మక సైకత శిల్పాలు రూపొందించారు. ఒకటి నుంచి అయిదు వరకు జరిగిన అంతర్జాతీయ శాండ్‌ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రథమస్థానం లభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరానికి చెందిన బాలాజీ వరప్రసాద్‌ పోటీలో పాల్గొని అయిదు రోజుల పాటు ఎకో టూరిజం, మహిళా సాధికారత, అతిథి దేవోభవ తదితర సందేశాత్మక సైకత శిల్పాలు రూపొందించారు. ఒకటి నుంచి అయిదు వరకు జరిగిన అంతర్జాతీయ శాండ్‌ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రథమస్థానం లభించింది.
10/13
ప్రకాశం: ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్‌ మార్కాపురంలో బుధవారం సందడి చేశారు.ఈ సందర్భంగా అక్కడికి చేరిన వారిని అనసూయ ‘హాయ్‌ మార్కాపురం’ అని పలకరిస్తూ  కొన్ని సినీ గీతాలకు నృత్యం చేసి అలరించారు. ప్రకాశం: ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్‌ మార్కాపురంలో బుధవారం సందడి చేశారు.ఈ సందర్భంగా అక్కడికి చేరిన వారిని అనసూయ ‘హాయ్‌ మార్కాపురం’ అని పలకరిస్తూ కొన్ని సినీ గీతాలకు నృత్యం చేసి అలరించారు.
11/13
విజయనగరం: ఒడిశా, ఆంధ్రాలో  పడుతున్న వర్షాలకు నాగావళి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తోటపల్లి జలాశయంలోకి వరద చేరడంతో నీటిమట్టం 104.40 టీఎంసీలకు పెరిగింది. విజయనగరం: ఒడిశా, ఆంధ్రాలో పడుతున్న వర్షాలకు నాగావళి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తోటపల్లి జలాశయంలోకి వరద చేరడంతో నీటిమట్టం 104.40 టీఎంసీలకు పెరిగింది.
12/13
విశాఖపట్నం: అనంతగిరి మండలంలోని వివిధ పాఠశాలలకు నాడు- నేడులో భాగంగా వేసిన రంగులు కొద్దిరోజులకే పోతున్నాయి. భవనాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పాఠశాలలో గోడలకు వేసిన రంగులు ప్రస్తుతం రాలిపోయాయి. విశాఖపట్నం: అనంతగిరి మండలంలోని వివిధ పాఠశాలలకు నాడు- నేడులో భాగంగా వేసిన రంగులు కొద్దిరోజులకే పోతున్నాయి. భవనాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పాఠశాలలో గోడలకు వేసిన రంగులు ప్రస్తుతం రాలిపోయాయి.
13/13
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్‌ రావి ఆకుపై రేవంత్‌రెడ్డి చిత్రాన్ని మలచి శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్‌ రావి ఆకుపై రేవంత్‌రెడ్డి చిత్రాన్ని మలచి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని