News In Pics: చిత్రం చెప్పే సంగతులు(08-12-2023)

Updated : 08 Dec 2023 04:11 IST
1/13
విశాఖపట్నం:  బాబుసాల పంచాయతీ జడిగుడ గ్రామ సమీపంలోని జలపాతం జాలువారుతోంది. ఎత్తయిన కొండల మధ్య నుంచి పడుతున్న ఈ జలసవ్వడి అందరినీ ఆకర్షిస్తోంది. విశాఖపట్నం: బాబుసాల పంచాయతీ జడిగుడ గ్రామ సమీపంలోని జలపాతం జాలువారుతోంది. ఎత్తయిన కొండల మధ్య నుంచి పడుతున్న ఈ జలసవ్వడి అందరినీ ఆకర్షిస్తోంది.
2/13
విశాఖపట్నం: రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారి వద్ద కొండలపై పొగమంచు కమ్ముకుంది. ఈ దృశ్యం స్థానికులతోపాటు మన్యానికి వచ్చిన పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంది. విశాఖపట్నం: రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారి వద్ద కొండలపై పొగమంచు కమ్ముకుంది. ఈ దృశ్యం స్థానికులతోపాటు మన్యానికి వచ్చిన పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంది.
3/13
అమరావతి: ఆటోలో మహా అయితే నలుగురు.. ముందు కూడా కూర్చోపెడితే ఆరుగురు.. కానీ ఈ ఆటోవాలా చూడండి.విజయవాడ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ముస్తాబాద వెళ్లే దారిలో కనిపించిన చిత్రమిది. అమరావతి: ఆటోలో మహా అయితే నలుగురు.. ముందు కూడా కూర్చోపెడితే ఆరుగురు.. కానీ ఈ ఆటోవాలా చూడండి.విజయవాడ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ముస్తాబాద వెళ్లే దారిలో కనిపించిన చిత్రమిది.
4/13
ప్రకాశం: వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిందా అతిథి. జిల్లా శివార్లలో ఉన్న తురిమెళ్ల చెరువుకు చేరిన ఆ రష్యా పక్షిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. రష్యా నుంచి టిబెట్, హిమాలయాల మీదుగా ప్రయాణించి ఇక్కడికి వస్తుందని బర్డ్స్‌ ఫొటో గ్రాఫర్‌ బెల్లంకొండ భాను తెలిపారు. ప్రకాశం: వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిందా అతిథి. జిల్లా శివార్లలో ఉన్న తురిమెళ్ల చెరువుకు చేరిన ఆ రష్యా పక్షిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. రష్యా నుంచి టిబెట్, హిమాలయాల మీదుగా ప్రయాణించి ఇక్కడికి వస్తుందని బర్డ్స్‌ ఫొటో గ్రాఫర్‌ బెల్లంకొండ భాను తెలిపారు.
5/13
విశాఖపట్నం:  జాలారిపేటలో మహంకాళి అమ్మవారి ఉత్సవ నేపథ్యంలో గురువారం మత్స్యకారులు పడవలకు రంగుల తెరచాపలు ఏర్పాటు చేయడం కనువిందు చేసింది. విశాఖపట్నం: జాలారిపేటలో మహంకాళి అమ్మవారి ఉత్సవ నేపథ్యంలో గురువారం మత్స్యకారులు పడవలకు రంగుల తెరచాపలు ఏర్పాటు చేయడం కనువిందు చేసింది.
6/13
విజయనగరం:  మార్కొండపుట్టి ముంపు ప్రాంతంలో కొన్ని రోజులుగా గజరాజుల గుంపు సంచరిస్తోంది. అటు వైపున్న పొలాలకు రైతులు వెళ్లొద్దని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఏనుగుల రాకతో పంటలు పాడవుతున్నట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం: మార్కొండపుట్టి ముంపు ప్రాంతంలో కొన్ని రోజులుగా గజరాజుల గుంపు సంచరిస్తోంది. అటు వైపున్న పొలాలకు రైతులు వెళ్లొద్దని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏనుగుల రాకతో పంటలు పాడవుతున్నట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
7/13
నిర్మల్‌: కార్తిక మాసం సందర్భంగా పట్టణ శివారులోని గండిరామన్న క్షేత్రంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో 11,116 దీపాలు వెలిగించారు. నిర్మల్‌: కార్తిక మాసం సందర్భంగా పట్టణ శివారులోని గండిరామన్న క్షేత్రంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో 11,116 దీపాలు వెలిగించారు.
8/13
9/13
హైదరాబాద్‌:  కార్తికమాసంలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మను గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అమ్మవారి మూలవిరాట్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌: కార్తికమాసంలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మను గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అమ్మవారి మూలవిరాట్‌ను సుందరంగా తీర్చిదిద్దారు.
10/13
హైదరాబాద్‌: ఎల్బీస్టేడియం వద్ద బోనాలతో మహిళల సాంస్కృతిక ప్రదర్శన. హైదరాబాద్‌: ఎల్బీస్టేడియం వద్ద బోనాలతో మహిళల సాంస్కృతిక ప్రదర్శన.
11/13
హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవానికి వెళుతున్న గవర్నర్‌ తమిళిసై స్టేడియం వీఐపీ గేటు ముందు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యి నిరీక్షిస్తున్నారు. ఆ సమయంలో  ఓ పేదవాడు నమస్కరించగా తన దగ్గర ఉన్న  డ్రై ఫ్రూట్స్‌ ప్యాకెట్లను అతడికి ఇచ్చారు. హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవానికి వెళుతున్న గవర్నర్‌ తమిళిసై స్టేడియం వీఐపీ గేటు ముందు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యి నిరీక్షిస్తున్నారు. ఆ సమయంలో ఓ పేదవాడు నమస్కరించగా తన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌ ప్యాకెట్లను అతడికి ఇచ్చారు.
12/13
హైదరాబాద్‌: చుట్టూ ఆకట్టుకునేలా నీటి అలలు, చేపలు, సీతాకోక చిలుకల పేయింటింగ్స్‌తో కార్పొరేట్‌ స్విమ్మింగ్‌ పూల్‌లా ఉంది కదూ.. కూకట్‌పల్లిలోని ఖాజాకుంట చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ ఇంది. హైదరాబాద్‌: చుట్టూ ఆకట్టుకునేలా నీటి అలలు, చేపలు, సీతాకోక చిలుకల పేయింటింగ్స్‌తో కార్పొరేట్‌ స్విమ్మింగ్‌ పూల్‌లా ఉంది కదూ.. కూకట్‌పల్లిలోని ఖాజాకుంట చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ ఇంది.
13/13

మరిన్ని