News In Pics: చిత్రం చెప్పే సంగతులు(10-12-2023)

Updated : 10 Dec 2023 04:24 IST
1/13
అమరావతి: ఓం నమఃశ్శివాయ స్మరణతో కార్తిక దీపోత్సవం దేదీప్యమైంది. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో శనివారం రాత్రి నిర్వహించిన దీపోత్సవంలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. అజయ్‌కుమార్‌ బృందం కూచిపూడి నృత్యాలు అలరించాయి. అమరావతి: ఓం నమఃశ్శివాయ స్మరణతో కార్తిక దీపోత్సవం దేదీప్యమైంది. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో శనివారం రాత్రి నిర్వహించిన దీపోత్సవంలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. అజయ్‌కుమార్‌ బృందం కూచిపూడి నృత్యాలు అలరించాయి.
2/13
అమరావతి: విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో స్పృహాప్తి ఛారిటబుల్‌ ట్రస్టు మొదటి వార్షికోత్సవం.. నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ కార్యక్రమాలు, ఫ్యాషన్‌ డ్రెస్‌ పోటీలు... ఆహూతులను ఆకట్టుకున్నాయి. అమరావతి: విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో స్పృహాప్తి ఛారిటబుల్‌ ట్రస్టు మొదటి వార్షికోత్సవం.. నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ కార్యక్రమాలు, ఫ్యాషన్‌ డ్రెస్‌ పోటీలు... ఆహూతులను ఆకట్టుకున్నాయి.
3/13
అనంతపురం:  కార్తిక మాసం పురస్కరించుకొని అనంతపురం లలిత కళాపరిషత్‌ ప్రాంగణంలో శనివారం రాత్రి 108 మంది చిన్నారులు చేసిన నృత్యరూపకం అలరించింది. పార్వతీదేవి అలంకారంలో చిన్నారుల అభినయం మంత్రముగ్ధులను చేసింది. అనంతపురం: కార్తిక మాసం పురస్కరించుకొని అనంతపురం లలిత కళాపరిషత్‌ ప్రాంగణంలో శనివారం రాత్రి 108 మంది చిన్నారులు చేసిన నృత్యరూపకం అలరించింది. పార్వతీదేవి అలంకారంలో చిన్నారుల అభినయం మంత్రముగ్ధులను చేసింది.
4/13
విశాఖపట్నం: హుకుంపేట మండల కేంద్రంలో శనివారం సంతలో ఓ దబ్బకాయ భారీ పరిమాణంలో కనిపించింది. గుమ్మడికాయంత సైజులో ఉండటంతో దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సుమారు మూడు కేజీల బరువు తూగింది. విశాఖపట్నం: హుకుంపేట మండల కేంద్రంలో శనివారం సంతలో ఓ దబ్బకాయ భారీ పరిమాణంలో కనిపించింది. గుమ్మడికాయంత సైజులో ఉండటంతో దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సుమారు మూడు కేజీల బరువు తూగింది.
5/13
విశాఖపట్నం: తుపాను ప్రభావం తగ్గడంతో జిల్లాకు పర్యటకుల తాకిడి మొదలైంది.ప్రకృతి ప్రేమికులు పాడేరు చేరుకున్నారు. వంజంగి కొండకు శనివారం వేకువజామున చేరుకున్న వారు మంచు తెరల అందాలు చూసి మురిసిపోయారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విశాఖపట్నం: తుపాను ప్రభావం తగ్గడంతో జిల్లాకు పర్యటకుల తాకిడి మొదలైంది.ప్రకృతి ప్రేమికులు పాడేరు చేరుకున్నారు. వంజంగి కొండకు శనివారం వేకువజామున చేరుకున్న వారు మంచు తెరల అందాలు చూసి మురిసిపోయారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
6/13
7/13
అనకాపల్లి: గురువుభీమవరం వద్ద జలపాతం ఆహ్లాదం కలిగిస్తోంది. ఏటా డిసెంబరులో కొండల నుంచి నీరు పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ జలపాతం అందాలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు  ఇక్కడికి పెద్దఎత్తున తరలివస్తున్నారు.
అనకాపల్లి: గురువుభీమవరం వద్ద జలపాతం ఆహ్లాదం కలిగిస్తోంది. ఏటా డిసెంబరులో కొండల నుంచి నీరు పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ జలపాతం అందాలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి పెద్దఎత్తున తరలివస్తున్నారు.
8/13
సిద్దిపేట: మూడు రోజుల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రైతులు రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చాలా చోట్ల మొలకలొచ్చింది. వానలు తగ్గి.. ఎండ రావటంతో రైతులు తడిసిన ధాన్యాన్ని తిరిగి ఆరబెడుతున్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగు రోడ్డుపై తడిసి మొలకలొచ్చిన ధాన్యాన్ని ఇలా రైతులు వేరు చేస్తూ ఆవేదన చెందారు. సిద్దిపేట: మూడు రోజుల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రైతులు రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చాలా చోట్ల మొలకలొచ్చింది. వానలు తగ్గి.. ఎండ రావటంతో రైతులు తడిసిన ధాన్యాన్ని తిరిగి ఆరబెడుతున్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగు రోడ్డుపై తడిసి మొలకలొచ్చిన ధాన్యాన్ని ఇలా రైతులు వేరు చేస్తూ ఆవేదన చెందారు.
9/13
మెదక్‌: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని వట్‌పల్లి మండలం దుద్యాల శివారులోని సర్వేశ్వరపురి క్షేత్రంలో  శనివారం నిర్వాహకులు అంబికా శివమణి యోగి మహరాజ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటి దీపోత్సవం చేపట్టారు. మెదక్‌: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని వట్‌పల్లి మండలం దుద్యాల శివారులోని సర్వేశ్వరపురి క్షేత్రంలో శనివారం నిర్వాహకులు అంబికా శివమణి యోగి మహరాజ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటి దీపోత్సవం చేపట్టారు.
10/13
హైదరాబాద్: ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రజాప్రతినిధులు, డిపో మేనేజర్లు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అతివలు, యువతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. హైదరాబాద్: ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రజాప్రతినిధులు, డిపో మేనేజర్లు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అతివలు, యువతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
11/13
12/13
హైదరాబాద్: రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ వార్షికోత్సవం ఉడాన్‌ కల్చరల్‌ ఫెస్ట్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీత, నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.


హైదరాబాద్: రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ వార్షికోత్సవం ఉడాన్‌ కల్చరల్‌ ఫెస్ట్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీత, నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.
13/13

మరిన్ని