News In Pics: చిత్రం చెప్పే సంగతులు(11-12-2023)

Updated : 11 Dec 2023 04:48 IST
1/19
వనపర్తి పట్టణం పాతబస్టాండులో అల్లెమ్మ అనే మహిళ ధనియాలు, వాము ఇతర సామగ్రిని విక్రయిస్తారు. ఈమె కుమారుడు జశ్వంత్‌ పట్టణంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెలవు రోజుల్లో తల్లికి సాయంగా ఉంటూ వ్యాపారంలో ఆమెకు సహకారమందిస్తుంటాడు. వనపర్తి పట్టణం పాతబస్టాండులో అల్లెమ్మ అనే మహిళ ధనియాలు, వాము ఇతర సామగ్రిని విక్రయిస్తారు. ఈమె కుమారుడు జశ్వంత్‌ పట్టణంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెలవు రోజుల్లో తల్లికి సాయంగా ఉంటూ వ్యాపారంలో ఆమెకు సహకారమందిస్తుంటాడు.
2/19
నెల్లూరు: ఇటీవల కురిసిన వర్షాలతో ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీలోని శైవ క్షేత్రమైన లింగాలదొన సమీప అటవీ ప్రాంతంలో ఈ సెలయేరు పరవళ్లు తొక్కుతోంది. దీన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు అక్కడికి వెళుతున్నారు. నెల్లూరు: ఇటీవల కురిసిన వర్షాలతో ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీలోని శైవ క్షేత్రమైన లింగాలదొన సమీప అటవీ ప్రాంతంలో ఈ సెలయేరు పరవళ్లు తొక్కుతోంది. దీన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు అక్కడికి వెళుతున్నారు.
3/19
గుంటూరు: మేడికొండూరు మండలం విసదల, మందపాడులోని పంటపొలాల్లో విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి.వాటికి సమీపంలో రైతులు, కూలీలు పొలం పనులు చేసుకుంటున్నారు. గుంటూరు: మేడికొండూరు మండలం విసదల, మందపాడులోని పంటపొలాల్లో విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి.వాటికి సమీపంలో రైతులు, కూలీలు పొలం పనులు చేసుకుంటున్నారు.
4/19
నేవీ డే సందర్భంగా ఆదివారం విశాఖ తీరంలో నౌకాదళం ప్రదర్శనలతో అలరించింది. యుద్ధ నౌకలు, చేతక్‌ హెలికాప్టర్లు, ల్యాండింగ్‌ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేవీ డే సందర్భంగా ఆదివారం విశాఖ తీరంలో నౌకాదళం ప్రదర్శనలతో అలరించింది. యుద్ధ నౌకలు, చేతక్‌ హెలికాప్టర్లు, ల్యాండింగ్‌ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
5/19
6/19
7/19
హైదరాబాద్‌: జూపార్కు ఆదివారం జనంతో కళకళలాడింది. సెలవు రోజు కావడంతో కుటుంబాలతో సహా  సందర్శకులు ఇక్కడికి తరలివచ్చారు. జంతువులు, పక్షులను వీక్షించి ప్రకృతి ఒడిలో సేదదీరారు. హైదరాబాద్‌: జూపార్కు ఆదివారం జనంతో కళకళలాడింది. సెలవు రోజు కావడంతో కుటుంబాలతో సహా సందర్శకులు ఇక్కడికి తరలివచ్చారు. జంతువులు, పక్షులను వీక్షించి ప్రకృతి ఒడిలో సేదదీరారు.
8/19
9/19
10/19
11/19
12/19
హైదరాబాద్‌: సాయంత్రం వేళ హుస్సేన్‌సాగర్‌ను చూసేందుకు తరలివచ్చిన సందర్శకులతో ట్యాంకుబండ్‌ ఆదివారం సందడిగా మారింది. బుద్ధుడు, అంబేడ్కర్‌    విగ్రహాలతోపాటు విద్యుత్తు కాంతులతో మెరుస్తున్న సచివాలయాన్ని చూస్తూ ఆహ్లాదంగా గడిపారు. హైదరాబాద్‌: సాయంత్రం వేళ హుస్సేన్‌సాగర్‌ను చూసేందుకు తరలివచ్చిన సందర్శకులతో ట్యాంకుబండ్‌ ఆదివారం సందడిగా మారింది. బుద్ధుడు, అంబేడ్కర్‌ విగ్రహాలతోపాటు విద్యుత్తు కాంతులతో మెరుస్తున్న సచివాలయాన్ని చూస్తూ ఆహ్లాదంగా గడిపారు.
13/19
హైదరాబాద్‌: నడుముకు తాడు కట్టుకుని టైరు లాగుతూ హాకీ సాధన చేస్తున్న వీరంతా సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ 7, 8 తరగతి విద్యార్థినులు. హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్, పరుగు, కబడ్డీ తదితర ఆటల్లో నిత్యం కఠోర సాధన చేస్తున్నారు. చదువులోనూ రాణిస్తున్నారు. హైదరాబాద్‌: నడుముకు తాడు కట్టుకుని టైరు లాగుతూ హాకీ సాధన చేస్తున్న వీరంతా సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ 7, 8 తరగతి విద్యార్థినులు. హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్, పరుగు, కబడ్డీ తదితర ఆటల్లో నిత్యం కఠోర సాధన చేస్తున్నారు. చదువులోనూ రాణిస్తున్నారు.
14/19
హైదరాబాద్‌: గచ్చిబౌలి రంగ్‌భూమి ఆడిటోరియంలో ఆదివారం కూచిపూడి నృత్య కళారాణి నియంత్రిక రెడ్డి, 40 మంది కళాకారుల బృందంతో కలిసి ప్రదర్శించిన ‘చండాలిక’ నృత్య రూపకం ఆద్యంతం రమణీయంగా సాగింది. హైదరాబాద్‌: గచ్చిబౌలి రంగ్‌భూమి ఆడిటోరియంలో ఆదివారం కూచిపూడి నృత్య కళారాణి నియంత్రిక రెడ్డి, 40 మంది కళాకారుల బృందంతో కలిసి ప్రదర్శించిన ‘చండాలిక’ నృత్య రూపకం ఆద్యంతం రమణీయంగా సాగింది.
15/19
హైదరాబాద్‌: సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీ పార్కు నుంచి ఎన్టీఆర్‌ రోడ్డుకు రావటానికి చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో పలువురు ఇలా ప్రమాదకరంగా గ్రిల్స్‌ దాటుతున్నారు. ఆదివారం పలువురు యువతులు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతూ పైకి ఎక్కి దిగడం కనిపించింది. ప్రమాదకరమని తెలిసినా.. ఇలా వెళ్లడం సరికాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌: సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీ పార్కు నుంచి ఎన్టీఆర్‌ రోడ్డుకు రావటానికి చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో పలువురు ఇలా ప్రమాదకరంగా గ్రిల్స్‌ దాటుతున్నారు. ఆదివారం పలువురు యువతులు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతూ పైకి ఎక్కి దిగడం కనిపించింది. ప్రమాదకరమని తెలిసినా.. ఇలా వెళ్లడం సరికాదని గుర్తించాల్సిన అవసరం ఉంది.
16/19
హైదరాబాద్‌: ఆర్జీఐఏ పరిధి గగన్‌పహాడ్‌ గోశాలలో 23వ వార్షికోత్సవాలు (అన్నకూట్‌) అంగరంగ వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు  గోవులకు పండ్లు, దాణా తినిపించారు.
హైదరాబాద్‌: ఆర్జీఐఏ పరిధి గగన్‌పహాడ్‌ గోశాలలో 23వ వార్షికోత్సవాలు (అన్నకూట్‌) అంగరంగ వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవులకు పండ్లు, దాణా తినిపించారు.
17/19
18/19
బందీలుగా ఉన్న తమ వారిని విడిపించాలని కోరుతూ టెల్‌ అవీవ్‌లో ఇజ్రాయెలీల ప్రదర్శన. బందీలుగా ఉన్న తమ వారిని విడిపించాలని కోరుతూ టెల్‌ అవీవ్‌లో ఇజ్రాయెలీల ప్రదర్శన.
19/19
జర్మనీలోని మిచెన్‌డార్ప్‌లో ఆదివారం నిర్వహించిన పరుగు పందెంలో శాంతాక్లాజ్‌ దుస్తుల్లో పాల్గొన్న స్థానికులు. జర్మనీలోని మిచెన్‌డార్ప్‌లో ఆదివారం నిర్వహించిన పరుగు పందెంలో శాంతాక్లాజ్‌ దుస్తుల్లో పాల్గొన్న స్థానికులు.

మరిన్ని