News In Pics: చిత్రం చెప్పే సంగతులు(12-12-2023)

Updated : 12 Dec 2023 04:10 IST
1/17
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వీవీఐటీ కళాశాలలో సోమవారం బాలోత్సవం ఉత్సాహంగా ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు  తరలివచ్చారు. సోలో విభాగంలో జానపద, శాస్త్రీయ నృత్య పోటీల్లో పాల్గొని సందడి చేశారు. చిత్రలేఖనం పోటీల్లో అదిరిపోయే చిత్రాలు గీసి ఆకట్టుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వీవీఐటీ కళాశాలలో సోమవారం బాలోత్సవం ఉత్సాహంగా ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. సోలో విభాగంలో జానపద, శాస్త్రీయ నృత్య పోటీల్లో పాల్గొని సందడి చేశారు. చిత్రలేఖనం పోటీల్లో అదిరిపోయే చిత్రాలు గీసి ఆకట్టుకున్నారు.
2/17
3/17
4/17
అమరావతిలి; సోమవారం విజయవాడ నోవోటెల్‌ హోటల్‌లో ‘సైంధవ్‌’ చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హీరో వెంకటేష్, హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ విజయవాడ వచ్చారు. అమరావతిలి; సోమవారం విజయవాడ నోవోటెల్‌ హోటల్‌లో ‘సైంధవ్‌’ చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హీరో వెంకటేష్, హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ విజయవాడ వచ్చారు.
5/17
అమరావతి: కార్తికమాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయాలు శివ నామస్మరణతో మారుమోగాయి. హరహర మహాదేవ శంభోశంకరా .. పాహిమాం అంటూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. తెల్లవారుజామునే కృష్ణానదిలో స్నానాలు చేసి కార్తిక దీపాలు వదిలారు.పాత శివాలయంలో పెద్దఎత్తున అభిషేకాలు చేశారు. అమరావతి: కార్తికమాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయాలు శివ నామస్మరణతో మారుమోగాయి. హరహర మహాదేవ శంభోశంకరా .. పాహిమాం అంటూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. తెల్లవారుజామునే కృష్ణానదిలో స్నానాలు చేసి కార్తిక దీపాలు వదిలారు.పాత శివాలయంలో పెద్దఎత్తున అభిషేకాలు చేశారు.
6/17
7/17
వరంగల్‌: హంటర్‌రోడ్డులోని కాకతీయ జూపార్క్‌లోకి తెచ్చిన పసుపు రంగు రామచిలుక, దక్షిణ ఎరుపు జింకలు వీక్షకులను ఆకట్టుకోనున్నాయని జిల్లా అటవీశాఖ అధికారి లావణ్య తెలిపారు. వరంగల్‌: హంటర్‌రోడ్డులోని కాకతీయ జూపార్క్‌లోకి తెచ్చిన పసుపు రంగు రామచిలుక, దక్షిణ ఎరుపు జింకలు వీక్షకులను ఆకట్టుకోనున్నాయని జిల్లా అటవీశాఖ అధికారి లావణ్య తెలిపారు.
8/17
నల్గొండ: నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న సన్నటి అంతర్జాల తీగపై సోమవారం ఓ వానరం ఒంటి కాలుతో నడుస్తూ విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ‘న్యూస్‌టుడే’ కంట పడింది. నల్గొండ: నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న సన్నటి అంతర్జాల తీగపై సోమవారం ఓ వానరం ఒంటి కాలుతో నడుస్తూ విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ‘న్యూస్‌టుడే’ కంట పడింది.
9/17
జోగులాంబ గద్వాల: మానవపాడు మండలం అమరవాయి నుంచి కలుకుంట్లకు ఎడ్లబండిపై పొలం పనులకు వెళ్తున్న కూలీలు. జోగులాంబ గద్వాల: మానవపాడు మండలం అమరవాయి నుంచి కలుకుంట్లకు ఎడ్లబండిపై పొలం పనులకు వెళ్తున్న కూలీలు.
10/17
హైదరాబాద్‌: కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా రామ్‌ కోటి రావ్‌మందిర్‌లో  శివుడ్ని పూలతో అలంకరించారు. భక్తులు శివలింగాకారంలో దీపాలు వెలిగించారు. హైదరాబాద్‌: కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా రామ్‌ కోటి రావ్‌మందిర్‌లో శివుడ్ని పూలతో అలంకరించారు. భక్తులు శివలింగాకారంలో దీపాలు వెలిగించారు.
11/17
12/17
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి విశేషస్పందన లభిస్తోంది. ప్రయాణం ఉచితం కావడంతో పెద్ద సంఖ్యలో మహిళలు.. ఆలస్యమైనా సరే ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. హయత్‌నగర్‌ బస్టాండ్‌లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి విశేషస్పందన లభిస్తోంది. ప్రయాణం ఉచితం కావడంతో పెద్ద సంఖ్యలో మహిళలు.. ఆలస్యమైనా సరే ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. హయత్‌నగర్‌ బస్టాండ్‌లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.
13/17
హైదరాబాద్‌: ఔటర్‌ చుట్టూ పరుచుకున్న పచ్చదనమిది. కొన్నేళ్లుగా ఓఆర్‌ఆర్‌ వెంట వేల    సంఖ్యలో నాటిన మొక్కలు పెరిగి పెద్దవికావడంతో ఇక్కడ చిన్నపాటి అడవిని తలపిస్తోంది. తుక్కుగూడ రావిర్యాల సమీపంలో ఆహ్లాద దృశ్యమిది. హైదరాబాద్‌: ఔటర్‌ చుట్టూ పరుచుకున్న పచ్చదనమిది. కొన్నేళ్లుగా ఓఆర్‌ఆర్‌ వెంట వేల సంఖ్యలో నాటిన మొక్కలు పెరిగి పెద్దవికావడంతో ఇక్కడ చిన్నపాటి అడవిని తలపిస్తోంది. తుక్కుగూడ రావిర్యాల సమీపంలో ఆహ్లాద దృశ్యమిది.
14/17
హైదరాబాద్‌: కార్తికమాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సికింద్రాబాద్‌లోని గణపతి ఆలయంలో సామూహిక    సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. మారేడుపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. హైదరాబాద్‌: కార్తికమాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సికింద్రాబాద్‌లోని గణపతి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. మారేడుపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించారు.
15/17
16/17
హైదరాబాద్‌: మీర్‌పేట మంత్రాల చెరువు సుందరీకరణ పేరుతో చేపట్టిన వాకర్స్‌ పాత్‌ ప్లాట్‌ఫారం నిర్మాణం పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. చెరువంతా గుర్రపు డెక్కతో నిండిపోయింది. సమీప కాలనీల డ్రైనేజీ చెరువులో కలుస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. హైదరాబాద్‌: మీర్‌పేట మంత్రాల చెరువు సుందరీకరణ పేరుతో చేపట్టిన వాకర్స్‌ పాత్‌ ప్లాట్‌ఫారం నిర్మాణం పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. చెరువంతా గుర్రపు డెక్కతో నిండిపోయింది. సమీప కాలనీల డ్రైనేజీ చెరువులో కలుస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది.
17/17
అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లో 60 వేల ఎల్‌ఈడీ బల్బులతో వెలిగిపోతున్న 110 అడుగుల ఎత్తయిన క్రిస్మస్‌ చెట్టు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్‌లో 60 వేల ఎల్‌ఈడీ బల్బులతో వెలిగిపోతున్న 110 అడుగుల ఎత్తయిన క్రిస్మస్‌ చెట్టు.

మరిన్ని