News In Pics: చిత్రం చెప్పే సంగతులు(13-12-2023)

Updated : 13 Dec 2023 03:51 IST
1/15
హైదరాబాద్: షేక్‌పేట గుట్టపోచమ్మ దేవాయంలో కార్తిక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో భక్తులు వందల దీపాలు శివలింగం, పూల ఆకారాల్లో వెలిగించగా ఆలయంలో శివలింగం దీపాల ముగ్గులా కనిపించింది. కార్యక్రమంలో కథక్‌ నృత్య కళాకారుడు నటేశ్వలింగం పాల్గొన్నారు. హైదరాబాద్: షేక్‌పేట గుట్టపోచమ్మ దేవాయంలో కార్తిక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో భక్తులు వందల దీపాలు శివలింగం, పూల ఆకారాల్లో వెలిగించగా ఆలయంలో శివలింగం దీపాల ముగ్గులా కనిపించింది. కార్యక్రమంలో కథక్‌ నృత్య కళాకారుడు నటేశ్వలింగం పాల్గొన్నారు.
2/15
హైదరాబాద్: జేఎన్‌టీయూ వంతెన ప్రహరీపై ఓ మొక్క పెరుగుతోంది. శ్లాబు నుంచి పెరుగుతున్న ఈ మొక్క ప్రహరీ వరకు పాకింది. ఈ మొక్క.. భారీ వృక్షంగా మారి ఎలాంటి ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్: జేఎన్‌టీయూ వంతెన ప్రహరీపై ఓ మొక్క పెరుగుతోంది. శ్లాబు నుంచి పెరుగుతున్న ఈ మొక్క ప్రహరీ వరకు పాకింది. ఈ మొక్క.. భారీ వృక్షంగా మారి ఎలాంటి ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
3/15
హైదరాబాద్: ఎస్సార్‌నగర్‌ బచ్‌పన్‌ ప్లే స్కూల్‌లో మంగళవారం అంతర్గత పాఠశాలల క్రీడా పోటీలు సందడిగా జరిగాయి. వివిధ రకాల క్రీడలతో పాటు షో అండ్‌ టెల్, క్విజ్, డ్యాన్స్‌ తదితర పోటీలు నిర్వహించారు. విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్: ఎస్సార్‌నగర్‌ బచ్‌పన్‌ ప్లే స్కూల్‌లో మంగళవారం అంతర్గత పాఠశాలల క్రీడా పోటీలు సందడిగా జరిగాయి. వివిధ రకాల క్రీడలతో పాటు షో అండ్‌ టెల్, క్విజ్, డ్యాన్స్‌ తదితర పోటీలు నిర్వహించారు. విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
4/15
మెదక్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి. డిసెంబరు వచ్చిందంటే చాలు ఇక్కడ క్రిస్మస్‌ సందడి షురూ అవుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఏసుక్రీస్తు జన్మంచిన స్థలం జెరూసలెంలోని బెత్లహం నమూనాను వెస్లీ బాలుర వసతిగృహ ప్రాంగణంలో విద్యార్థులు రూపొందించారు. మెదక్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి. డిసెంబరు వచ్చిందంటే చాలు ఇక్కడ క్రిస్మస్‌ సందడి షురూ అవుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఏసుక్రీస్తు జన్మంచిన స్థలం జెరూసలెంలోని బెత్లహం నమూనాను వెస్లీ బాలుర వసతిగృహ ప్రాంగణంలో విద్యార్థులు రూపొందించారు.
5/15
వరంగల్‌: కార్తికమాసం మంగళవారం అమావాస్య తిథి సందర్భంగా హనుమకొండలో పద్మాక్షి కాలనీలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పరమశివుడిని 51 కిలోల ఉసిరి, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వరంగల్‌: కార్తికమాసం మంగళవారం అమావాస్య తిథి సందర్భంగా హనుమకొండలో పద్మాక్షి కాలనీలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పరమశివుడిని 51 కిలోల ఉసిరి, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
6/15
మెదక్‌: వాన జల్లు పడి వెలసిన తర్వాత రోడ్డుపై ఏర్పడిన నీటి చారికలు కావివి. సిద్దిపేట బైపాస్‌ రోడ్డు నుంచి కరీంనగర్‌ వెళ్లే మార్గంలో సూర్య కిరణాలు పడి చూపరులకు దూరం నుంచి భ్రాంతి కలిగేలా ఏర్పడి, కెమెరాకు చిక్కిన ఎండమావులు అవి. మెదక్‌: వాన జల్లు పడి వెలసిన తర్వాత రోడ్డుపై ఏర్పడిన నీటి చారికలు కావివి. సిద్దిపేట బైపాస్‌ రోడ్డు నుంచి కరీంనగర్‌ వెళ్లే మార్గంలో సూర్య కిరణాలు పడి చూపరులకు దూరం నుంచి భ్రాంతి కలిగేలా ఏర్పడి, కెమెరాకు చిక్కిన ఎండమావులు అవి.
7/15
ఆదిలాబాద్‌: రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదవుతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో ఉదయం 10 గంటల వరకు పొగమంచు అలాగే ఉంటోంది. తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో ప్రజలెవరూ బయటకు రాలేకపోతున్నారు. ఆదిలాబాద్‌: రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదవుతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో ఉదయం 10 గంటల వరకు పొగమంచు అలాగే ఉంటోంది. తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో ప్రజలెవరూ బయటకు రాలేకపోతున్నారు.
8/15
విశాఖపట్నం: స్థానిక ఏకలవ్య పాఠశాల, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు మంగళవారం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. నృత్యాలు ఆకట్టుకున్నాయి. విశాఖపట్నం: స్థానిక ఏకలవ్య పాఠశాల, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు మంగళవారం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. నృత్యాలు ఆకట్టుకున్నాయి.
9/15
అనంతపురం నగరానికి చెందిన డిస్కోబాబు (రహ్మతుల్లా)  హరియాణా నుంచి 1950వ దశకానికి చెందిన కారును కొనుగోలు చేశారు. పెళ్లయిన వారికి తీపి జ్ఞాపకంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం నగరానికి చెందిన డిస్కోబాబు (రహ్మతుల్లా) హరియాణా నుంచి 1950వ దశకానికి చెందిన కారును కొనుగోలు చేశారు. పెళ్లయిన వారికి తీపి జ్ఞాపకంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
10/15
చిత్తూరు: కార్తిక అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం స్వర్ణమ్మ హారతుల కార్యక్రమం అద్భుతంగా జరిగింది. స్వర్ణముఖి నది తీరంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్తూరు: కార్తిక అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయం స్వర్ణమ్మ హారతుల కార్యక్రమం అద్భుతంగా జరిగింది. స్వర్ణముఖి నది తీరంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
11/15
పార్వతీపురం: పైడితల్లి సిరిమానోత్సవం ముగింపులో భాగంగా చదురుగుడి ప్రాంగణంలో మహాన్నదాన కార్యక్రమం మంగళవారం జరిగింది.సుమారు 12 వేల మంది భక్తులు అమ్మవారి ప్రసాదం  స్వీకరించారు. అమ్మవార్లను ప్రత్యేకంగా అలకరించారు. పార్వతీపురం: పైడితల్లి సిరిమానోత్సవం ముగింపులో భాగంగా చదురుగుడి ప్రాంగణంలో మహాన్నదాన కార్యక్రమం మంగళవారం జరిగింది.సుమారు 12 వేల మంది భక్తులు అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. అమ్మవార్లను ప్రత్యేకంగా అలకరించారు.
12/15
అమరావతి: కార్తిక మాసం ముగింపులో భాగంగా మంగళవారం సాయంత్రం నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం వెలిగిపోయింది. 60 కేజీల నూనెతో 18 కేజీల బరువు 3.5 అడుగుల ఎత్తు గల దీపం వెలిగించి కృష్ణానదిలో వదిలారు. అమరావతి: కార్తిక మాసం ముగింపులో భాగంగా మంగళవారం సాయంత్రం నాగాయలంక శ్రీరామ పాద క్షేత్రం వెలిగిపోయింది. 60 కేజీల నూనెతో 18 కేజీల బరువు 3.5 అడుగుల ఎత్తు గల దీపం వెలిగించి కృష్ణానదిలో వదిలారు.
13/15
గుంటూరు: నంబూరులోని వీవీఐటీలో జరుగుతున్న బాలోత్సవ్‌ వేడుకలు రెండో రోజు మంగళవారం ఉత్సాహంగా సాగాయి..చిత్ర, విచిత్ర వేషధారణలు, జానపద,  కూచిపూడి నృత్యాలు అలరించాయి. గుంటూరు: నంబూరులోని వీవీఐటీలో జరుగుతున్న బాలోత్సవ్‌ వేడుకలు రెండో రోజు మంగళవారం ఉత్సాహంగా సాగాయి..చిత్ర, విచిత్ర వేషధారణలు, జానపద, కూచిపూడి నృత్యాలు అలరించాయి.
14/15
గుంటూరు: ఈ బాలిక నాలుగేళ్లుగా బాలోత్సవ్‌లో విభిన్న వేషధారణలతో అందరినీ   ఆలోచింపజేస్తోంది.ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్‌ పబ్లిక్‌ స్కూలుకు చెందిన క్రిషి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాలోత్సవాల్లో విభిన్న ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది. గుంటూరు: ఈ బాలిక నాలుగేళ్లుగా బాలోత్సవ్‌లో విభిన్న వేషధారణలతో అందరినీ ఆలోచింపజేస్తోంది.ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్‌ పబ్లిక్‌ స్కూలుకు చెందిన క్రిషి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాలోత్సవాల్లో విభిన్న ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది.
15/15
హైదరాబాద్: కోతల అనంతరం ధాన్యాన్ని ఔటర్‌ రింగురోడ్డు సర్వీసు రహదారిపై పెద్ద ఎత్తున ఆరబోస్తున్నారు. ధాన్యం పక్కన పెద్ద బండరాళ్లు ఉంచుతున్నారు. రహదారిపై బండరాళ్లను గమనించని ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. హైదరాబాద్: కోతల అనంతరం ధాన్యాన్ని ఔటర్‌ రింగురోడ్డు సర్వీసు రహదారిపై పెద్ద ఎత్తున ఆరబోస్తున్నారు. ధాన్యం పక్కన పెద్ద బండరాళ్లు ఉంచుతున్నారు. రహదారిపై బండరాళ్లను గమనించని ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు.

మరిన్ని