News In Pics: చిత్రం చెప్పే సంగతులు(14-12-2023)

Updated : 14 Dec 2023 03:29 IST
1/18
విశాఖపట్నం: ఎక్స్‌ప్రెస్‌ రాజా,  జెంటిల్‌మెన్, బీరువా,  ఒక్క క్షణం... తదితర చిత్రాల్లో నటించిన కథానాయిక సురభి బుధవారం గాజువాకలో సందడి చేశారు. విశాఖపట్నం: ఎక్స్‌ప్రెస్‌ రాజా, జెంటిల్‌మెన్, బీరువా, ఒక్క క్షణం... తదితర చిత్రాల్లో నటించిన కథానాయిక సురభి బుధవారం గాజువాకలో సందడి చేశారు.
2/18
విశాఖపట్నం: పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా తొలి గురువారం పూజలు బుధవారం అర్ధరాత్రి దాటాక ఆరంభమయ్యాయి. 12.05గంటలకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు.అనంతరం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. విశాఖపట్నం: పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా తొలి గురువారం పూజలు బుధవారం అర్ధరాత్రి దాటాక ఆరంభమయ్యాయి. 12.05గంటలకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు.అనంతరం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు.
3/18
అమరావతి: పోలిస్వర్గం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున రామలింగేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వదులుతున్న మహిళలు. అమరావతి: పోలిస్వర్గం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున రామలింగేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వదులుతున్న మహిళలు.
4/18
5/18
గుంటూరు: నంబూరు వీవీఐటీలో బుధవారం జరిగిన బాలోత్సవ్‌లో పలు సామాజిక సమస్యలపై చైతన్యం నింపేలా ప్రదర్శించిన ఏకపాత్రాభినయాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల వేషధారణ, సంభాషణ, అభినయం ఆహూతులను ముగ్దులను చేశాయి. గుంటూరు: నంబూరు వీవీఐటీలో బుధవారం జరిగిన బాలోత్సవ్‌లో పలు సామాజిక సమస్యలపై చైతన్యం నింపేలా ప్రదర్శించిన ఏకపాత్రాభినయాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల వేషధారణ, సంభాషణ, అభినయం ఆహూతులను ముగ్దులను చేశాయి.
6/18
7/18
ఏలూరులో మన్నా చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్‌ ఆరాధన పండగలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఏలూరులో మన్నా చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్‌ ఆరాధన పండగలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
8/18
అనంతపురం: పెనుకొండ మండల కేంద్రం సమీపంలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన కుంభకర్ణుడి పార్కు అధ్వానంగా మారింది.పిచ్చిమొక్కలు పెరుగుతున్నా మరమ్మతులు చేసేవారు కరవయ్యారు. విగ్రహం చుట్టూ ఉన్న మిగిలిన బొమ్మలు విరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. అనంతపురం: పెనుకొండ మండల కేంద్రం సమీపంలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన కుంభకర్ణుడి పార్కు అధ్వానంగా మారింది.పిచ్చిమొక్కలు పెరుగుతున్నా మరమ్మతులు చేసేవారు కరవయ్యారు. విగ్రహం చుట్టూ ఉన్న మిగిలిన బొమ్మలు విరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు.
9/18
వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాన్ని బియ్యం గింజలతో వేసి చిత్రకారుడు అబ్బురపరిచారు. ఆయన పలుసార్లు మహాత్మాగాంధీ, భారతమాత, డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రాలను ఆకులపై వేశారు. రంగుల బియ్యంతో వేసిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని చూసి పలువురు ఆయనను అభినందించారు. వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాన్ని బియ్యం గింజలతో వేసి చిత్రకారుడు అబ్బురపరిచారు. ఆయన పలుసార్లు మహాత్మాగాంధీ, భారతమాత, డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రాలను ఆకులపై వేశారు. రంగుల బియ్యంతో వేసిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని చూసి పలువురు ఆయనను అభినందించారు.
10/18
వరంగల్: రకాల పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం లక్ష పసుపు కొమ్ముల నోము నిర్వహించారు. 170 మంది మహిళలు నోములో కూర్చొని అమ్మవారికి పూజలు చేశారు. వరంగల్: రకాల పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం లక్ష పసుపు కొమ్ముల నోము నిర్వహించారు. 170 మంది మహిళలు నోములో కూర్చొని అమ్మవారికి పూజలు చేశారు.
11/18
నిజామాబాద్‌: వేసవికాలంలో చెట్లనినా ఎండిపోయి.. ఆకులు రాలిపోవడం చూస్తుంటాం. కానీ, ప్రస్తుతం శీతాకాలంలోనే చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయి మోడు వారి కనిపిస్తున్నాయి.నిజామాబాద్‌ నుంచి మంచిప్పకు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న పెద్ద వృక్షాలు మోడువారి రోడ్డంతా బోసిపోయినట్లు కనిపిస్తుంది. నిజామాబాద్‌: వేసవికాలంలో చెట్లనినా ఎండిపోయి.. ఆకులు రాలిపోవడం చూస్తుంటాం. కానీ, ప్రస్తుతం శీతాకాలంలోనే చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయి మోడు వారి కనిపిస్తున్నాయి.నిజామాబాద్‌ నుంచి మంచిప్పకు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న పెద్ద వృక్షాలు మోడువారి రోడ్డంతా బోసిపోయినట్లు కనిపిస్తుంది.
12/18
మెదక్‌: శాంతక్లాజ్‌ డేను మెదక్‌ పట్టణంలోని డాన్‌ బాస్కో ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పిల్లలు శాంతక్లాజ్‌ వేషధారణలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. మెదక్‌: శాంతక్లాజ్‌ డేను మెదక్‌ పట్టణంలోని డాన్‌ బాస్కో ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పిల్లలు శాంతక్లాజ్‌ వేషధారణలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు.
13/18
మెదక్‌: అమ్మ మాట.. ‘చేద బావి’ మూట అన్నట్టుగా అర్చకుడు ఇంటిని నిర్మించుకొని జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన అర్చకుడు భాస్కరరాయుని ఆంజనేయశర్మ.. తల్లి సరస్వతమ్మ మాటను తుచ తప్పక పాటించారు. మెదక్‌: అమ్మ మాట.. ‘చేద బావి’ మూట అన్నట్టుగా అర్చకుడు ఇంటిని నిర్మించుకొని జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన అర్చకుడు భాస్కరరాయుని ఆంజనేయశర్మ.. తల్లి సరస్వతమ్మ మాటను తుచ తప్పక పాటించారు.
14/18
మెదక్‌: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో రైల్వే భూగర్భ మార్గం గోడలపై ఉన్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, జీవనశైలిని ప్రతిబింబించే కళాచిత్రాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. పైనుంచి రైలు.. కింద వాహనదారులు వెళ్లేలా నిర్మాణం చేపట్టారు. మెదక్‌: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో రైల్వే భూగర్భ మార్గం గోడలపై ఉన్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, జీవనశైలిని ప్రతిబింబించే కళాచిత్రాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. పైనుంచి రైలు.. కింద వాహనదారులు వెళ్లేలా నిర్మాణం చేపట్టారు.
15/18
16/18
హైదరాబాద్‌: వివేకానందనగర్‌కాలనీలోని న్యూఎరా స్కూల్‌లో బుధవారం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల వ్యవస్థాపకురాలు శివకుమారి జయంతిని పురస్కరించుకొని ఆట,పాటలతో కూడిన నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్‌: వివేకానందనగర్‌కాలనీలోని న్యూఎరా స్కూల్‌లో బుధవారం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల వ్యవస్థాపకురాలు శివకుమారి జయంతిని పురస్కరించుకొని ఆట,పాటలతో కూడిన నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
17/18
హైదరాబాద్‌: నాలుగు వందల ఏళ్ల కిందట వేలాది మంది ప్రజల దాహార్తి తీర్చిన మహేశ్వరం మెట్ల బావి ఇది. నగరానికి అతిచేరువలో ఉన్న ఈ చారిత్రక కట్టడం కాలక్రమంలో చెత్తతో నిండిపోయింది. వచ్చే ఫిబ్రవరికల్లా అన్ని హంగులతో పూర్తిచేసి సందర్శనకు అనుమతిస్తారు. ఇదో పర్యాటక క్షేత్రంగా మారనుంది. హైదరాబాద్‌: నాలుగు వందల ఏళ్ల కిందట వేలాది మంది ప్రజల దాహార్తి తీర్చిన మహేశ్వరం మెట్ల బావి ఇది. నగరానికి అతిచేరువలో ఉన్న ఈ చారిత్రక కట్టడం కాలక్రమంలో చెత్తతో నిండిపోయింది. వచ్చే ఫిబ్రవరికల్లా అన్ని హంగులతో పూర్తిచేసి సందర్శనకు అనుమతిస్తారు. ఇదో పర్యాటక క్షేత్రంగా మారనుంది.
18/18
హైదరాబాద్‌: సాయంత్రమైతే చాలు ఐటీ కారిడార్‌ ప్రాంతంలో వందలాది వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం అవుతుంటుంది.  బుధవారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా కూడలి మీదుగా బయోడైవర్సిటీ రహదారి వైపు వాహనాలు ఇలా బారులు తీరాయి. హైదరాబాద్‌: సాయంత్రమైతే చాలు ఐటీ కారిడార్‌ ప్రాంతంలో వందలాది వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం అవుతుంటుంది. బుధవారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా కూడలి మీదుగా బయోడైవర్సిటీ రహదారి వైపు వాహనాలు ఇలా బారులు తీరాయి.

మరిన్ని