News In Pics: చిత్రం చెప్పే సంగతులు(15-12-2023)

Updated : 15 Dec 2023 19:52 IST
1/11
ఎటు చూసినా శ్వేతవర్ణంతో కళకళలాడుతూ కనిపిస్తున్న ఈ పత్తి చేను హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోనిది. రైతు సిరిపురం సంపత్‌ తన నాలుగెకరాల్లో పత్తి సాగు చేపట్టారు. కొన్నిరోజుల కిందట తొలి కాపు తెంపగా.. ప్రస్తుతం రెండో కాపు నిండుగా ఉంది. ఎటు చూసినా శ్వేతవర్ణంతో కళకళలాడుతూ కనిపిస్తున్న ఈ పత్తి చేను హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోనిది. రైతు సిరిపురం సంపత్‌ తన నాలుగెకరాల్లో పత్తి సాగు చేపట్టారు. కొన్నిరోజుల కిందట తొలి కాపు తెంపగా.. ప్రస్తుతం రెండో కాపు నిండుగా ఉంది.
2/11
మహబూబ్‌నగర్‌ మండలం జైనల్లీపూర్‌ గ్రామానికి చెందిన రైతు సున్నాల నర్సింహులు జులైలో వేసిన పంట ప్రస్తుతం కాపు దశలో ఉంది. ఆకులు తుంచేయడంతో కాయలు మాత్రమే మిగిలాయి. ఇలా ఎరుపు వర్ణంలో కనువిందు చేస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ మండలం జైనల్లీపూర్‌ గ్రామానికి చెందిన రైతు సున్నాల నర్సింహులు జులైలో వేసిన పంట ప్రస్తుతం కాపు దశలో ఉంది. ఆకులు తుంచేయడంతో కాయలు మాత్రమే మిగిలాయి. ఇలా ఎరుపు వర్ణంలో కనువిందు చేస్తున్నాయి.
3/11
అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఐరాస ప్రధాన కార్యాలయానికి సమీపంలో ‘ఫీల్డ్‌ ఆఫ్‌ లైట్‌’ పేరుతో ఏర్పాటుచేసిన కళాఖండమిది.సోలో వ్యూ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కళాకారుడు బ్రూస్‌ మున్రో, అతని బృంద సభ్యులు 18,750 ప్రకాశవంతమైన చిరు గోళాలను (బల్బులను) ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లతో అనుసంధానించి దీనికి రూపకల్పన చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఐరాస ప్రధాన కార్యాలయానికి సమీపంలో ‘ఫీల్డ్‌ ఆఫ్‌ లైట్‌’ పేరుతో ఏర్పాటుచేసిన కళాఖండమిది.సోలో వ్యూ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కళాకారుడు బ్రూస్‌ మున్రో, అతని బృంద సభ్యులు 18,750 ప్రకాశవంతమైన చిరు గోళాలను (బల్బులను) ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లతో అనుసంధానించి దీనికి రూపకల్పన చేశారు.
4/11
హైదరాబాద్‌: ఆరు గ్యారంటీల్లో భాగంగా  రాయితీపై  రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ స్థానికంగా ప్రచారం కావడంతో పాతబస్తీ శాలిబండలోని ఓ గ్యాస్‌ ఏజెన్సీకి గురువారం ఉదయమే భారీగా వినియోగదారులు తరలివచ్చి బారులు తీరారు. తీరా అలాంటిదేదీ లేదని తెలియడంతో నిరాశగా వెనుదిరిగారు. హైదరాబాద్‌: ఆరు గ్యారంటీల్లో భాగంగా రాయితీపై రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ స్థానికంగా ప్రచారం కావడంతో పాతబస్తీ శాలిబండలోని ఓ గ్యాస్‌ ఏజెన్సీకి గురువారం ఉదయమే భారీగా వినియోగదారులు తరలివచ్చి బారులు తీరారు. తీరా అలాంటిదేదీ లేదని తెలియడంతో నిరాశగా వెనుదిరిగారు.
5/11
హైదరాబాద్‌: కీసరలో జరుగుతున్న హరిహర పుత్ర అయ్యప్పస్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో గురువారం జలాధివాసం నేత్రపర్వంగా సాగింది. పంచామృతాభిషేకంతో పాటు గురువందనం, ఆవాహిత దేవతల పూజ, లక్ష్మీగణపతి, సుదర్శన, రుద్ర హోమాలు నిర్వహించారు. హైదరాబాద్‌: కీసరలో జరుగుతున్న హరిహర పుత్ర అయ్యప్పస్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో గురువారం జలాధివాసం నేత్రపర్వంగా సాగింది. పంచామృతాభిషేకంతో పాటు గురువందనం, ఆవాహిత దేవతల పూజ, లక్ష్మీగణపతి, సుదర్శన, రుద్ర హోమాలు నిర్వహించారు.
6/11
7/11
చిత్తూరు: తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలోని బస్సు ప్రాంగణం ఆకట్టుకుంటోంది. గోడలు, ఇటుకలు, రేకులతో కాకుండా చక్కటి సందేశాన్నిచ్చేందుకు దాన్నో వేదికలా మార్చేశారు. పచ్చదనం కోసం మొక్కల పెంపకం చేపట్టడంతో ప్రయాణికులు అక్కడ కూర్చునేందుకు ఇష్టపడుతున్నారు. చిత్తూరు: తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలోని బస్సు ప్రాంగణం ఆకట్టుకుంటోంది. గోడలు, ఇటుకలు, రేకులతో కాకుండా చక్కటి సందేశాన్నిచ్చేందుకు దాన్నో వేదికలా మార్చేశారు. పచ్చదనం కోసం మొక్కల పెంపకం చేపట్టడంతో ప్రయాణికులు అక్కడ కూర్చునేందుకు ఇష్టపడుతున్నారు.
8/11
ఖమ్మం: ఏన్కూరు మండలం రామాతండాలో ఓ రైతు అచ్చం స్త్రీని పోలిన దిష్టిబొమ్మ తయారు చేశారు. గులాబీరంగు చీర, తలపై కొంగు కప్పుకొన్నట్లు రూపొందించారు. దూరం నుంచి చూస్తే అచ్చం మనిషిలాగే కనబడుతుండటంతో అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఖమ్మం: ఏన్కూరు మండలం రామాతండాలో ఓ రైతు అచ్చం స్త్రీని పోలిన దిష్టిబొమ్మ తయారు చేశారు. గులాబీరంగు చీర, తలపై కొంగు కప్పుకొన్నట్లు రూపొందించారు. దూరం నుంచి చూస్తే అచ్చం మనిషిలాగే కనబడుతుండటంతో అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
9/11
హైదరాబాద్‌: నేవీ వారోత్సవాలను పురస్కరించుకుని నెక్లెస్‌ రోడ్డులోని 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం చెంత ఇండియన్‌ నేవీ (ఈస్టర్న్‌ నావెల్‌ కమాండ్, విశాఖపట్టణం) బ్యాండ్‌ బృందం గురువారం సాయంత్రం సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది.జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం వీనులవిందుగా సాగింది. హైదరాబాద్‌: నేవీ వారోత్సవాలను పురస్కరించుకుని నెక్లెస్‌ రోడ్డులోని 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం చెంత ఇండియన్‌ నేవీ (ఈస్టర్న్‌ నావెల్‌ కమాండ్, విశాఖపట్టణం) బ్యాండ్‌ బృందం గురువారం సాయంత్రం సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది.జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం వీనులవిందుగా సాగింది.
10/11
హైదరాబాద్‌: మాదాపూర్‌ రహేజా మైండ్‌ స్పేస్‌ కూడలిలో ఆటోవాలాలు డివైడర్లు కూల్చి.. లోపల తిష్ఠ వేసి పచ్చదనాన్ని హరించారు. దీనిపై ఈనెల 11న ‘డివైడర్లు కూల్చి.. ఆటోలు నిలిపి’ శీర్షికన ఈనాడులో చిత్ర కథనం ప్రచురితమైంది. హైదరాబాద్‌: మాదాపూర్‌ రహేజా మైండ్‌ స్పేస్‌ కూడలిలో ఆటోవాలాలు డివైడర్లు కూల్చి.. లోపల తిష్ఠ వేసి పచ్చదనాన్ని హరించారు. దీనిపై ఈనెల 11న ‘డివైడర్లు కూల్చి.. ఆటోలు నిలిపి’ శీర్షికన ఈనాడులో చిత్ర కథనం ప్రచురితమైంది.
11/11
హైదరాబాద్‌: నార్సింగి ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కనున్న సైకిల్‌ ట్రాక్‌ ఇది. సాధారణంగా రోడ్డు పక్కన ఒకటో.. రెండో సూచికలుంటాయి. ఇక్కడ భద్రతను దృష్టిలో ఉంచుకుని వరుసగా 6 సూచికలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌: నార్సింగి ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కనున్న సైకిల్‌ ట్రాక్‌ ఇది. సాధారణంగా రోడ్డు పక్కన ఒకటో.. రెండో సూచికలుంటాయి. ఇక్కడ భద్రతను దృష్టిలో ఉంచుకుని వరుసగా 6 సూచికలు ఏర్పాటు చేశారు.

మరిన్ని