News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (25-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 25 May 2024 09:57 IST
1/21
విశాఖ జిల్లా ఎన్‌ఏడీ కూడలి వద్ద సింహాచలం కొండల మీదుగా  నాలుగు గంటల సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. వేసవి వేడి గాలులకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం దక్కింది. అయితే...వర్షం కురుస్తుందని ఆశించినా... వరుణుడు కరుణించలేదు. 

2/21
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. సముద్రంలోని అలలు తీరానికి సమీపంగా రావటంతో ఎండల నుంచి ఉపశమనం పొందేలా పలువురు స్నానాలు చేస్తూ సందడి చేశారు.

3/21
విశాఖ జిల్లా  రుషికొండ బీచ్‌రోడ్డులోని ఒక హోటల్‌ సమీపంలో  పనస చెట్టు విరగకాసింది. ఈ చెట్టుకు పనసకాయలు అధికంగా కనిపిస్తుండడంతో స్థానికులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.  

4/21
చీపురు పుల్లలా, ఎండుటాకులా కనిపిస్తున్న ఈ కీటకం  చెట్టు బెరడు రంగులో కలిసిపోయిది. పరిశీలనగా  చూస్తే తప్ప అదో కీటకమని గుర్తించలేం. విశాఖ జిల్లా చీడికాడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న బాదం చెట్టుపై పాకుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. దీన్ని గొల్లభామగా పిలుస్తారని స్థానికులు పేర్కొన్నారు. 

5/21
 జామకాయలు సహజంగా వంద నుంచి 150 గ్రాముల మధ్యన బరువుంటాయి. విశాఖ జిల్లా నక్కపల్లిలో  ఓ దుకాణదారుడు తన బండిపై విక్రయానికి తెచ్చిన కాయల్లో కొన్ని చాలా భారీ సైజులో ఉన్నాయి. ఇవి ఒకొక్కటి అర కేజీకిపైగా తూగడం విశేషం. 

6/21
చూసే కళ్లు, స్పందించే హృదయం ఉండాలే కానీ అల్లూరి జిల్లాలో సహజసిద్ధ అందాలకు కొదవలేదు. ఏ చిత్రకారుడో తన కుంచెతో గీసినట్లు ఉన్న ఈ దృశ్యం విశాఖ జిల్లా చింతపల్లి- నర్సీపట్నం మార్గంలోని లోతుగెడ్డ కూడలి సమీపంలో ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది.

7/21
వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం కేశవపల్లిలో వ్యవసాయ బావులు అధికంగా ఉన్నాయి. రాతి కట్టడాలతో ఆకట్టుకుంటున్నాయి. నీళ్లు సమృద్ధిగా ఉండడంతో విద్యార్థులు ఈత కొడుతున్నారు. ఎండలు మండుతుండడంతో గంటల తరబడి జలకాలాటలతో సేదదీరుతున్నారు

8/21
నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమం(గోదావరి, మంజీరా, హరిద్ర) వద్ద గోదావరి నది పరిస్థితి ఇది. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం లేక గోదావరి ఖాళీ అయ్యి ఇసుక మేటలు బయటపడ్డాయి.

9/21
చిత్రంలో కన్పిస్తున్నవి మల్బరీ బెర్రీ పండ్లు. అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు నుంచి కేశప్పగూడెం వెళ్లే మార్గంలోని రైతు కంచర్ల భాస్కరరావు తోటలోని చెట్టుకు కాసిన పండ్లు ఇవి. పట్టుపురుగుల మల్బరీ చెట్టుకు సంబంధించిన జాతిలో ఒక రకమైన మొక్క ఇది.

10/21
ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తాల్సిన పరిస్థితి నెలకొంది.  ఓ యువకుడు ఉన్నితో చేసిన శిరస్త్రాణం ధరించి స్థానిక రహదారులపై కనిపించాడు.

11/21
కారును కడగడానికి పైపు ఏర్పాటు చేశారని అనుకుంటే పొరపాటే. కరీంనగర్‌ కమాన్‌ సమీపంలోని హౌసింగ్‌బోర్డు రోడ్డులో పబ్లిక్‌ కుళాయి పగిలి.. ఇలా నీరు విరజిమ్మింది. పక్కనే కారు నిలిపి ఉంచడంతో ఆ నీరు దానిపై పడింది.

12/21
ఎండల తీవ్రతను తట్టుకోవటానికి పలువురు ఆటోల్లో, లారీల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. వీటి వల్ల వేడి గాలి వస్తోందని భావించిన కొందరు లారీ డ్రైవర్లు సరికొత్తగా లారీ క్యాబిన్‌లలో కూలర్లను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.

13/21
‘శక్తి’ పథకానికి వినియోగిస్తున్న బస్సుల్లో ఎక్కువ శాతం మరమ్మతుల పాలయ్యాయి. కొన్ని బస్సుల పైకప్పులకు రంధ్రాలు పడ్డాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు వర్షం కురవడంతో తడవకుండా ఉండేందుకు ఇలా గొడుగు వేసుకుని ఆర్టీసీ డ్రైవరు బస్సు నడిపారు. ఈశాన్య కర్ణాటక విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

14/21
కన్నియాకుమరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలకు తిర్పరప్పు జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పర్యాటకులు స్నానం చేసేందుకు నిషేధం విధించారు

15/21
తీగల వంతెనపై నెలక్రితం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..  రెండురోజులు హడావుడి చేసిన పోలీసులు అటువైపు చూడడం మానేశారు. దీంతో ఎప్పటిలాగే వంతెనపై వాహనాలు నిలిపి ఫొటోలు దిగడం, బర్త్‌ డే వేడుకలు జరుపుకోవడం మొదలుపెట్టారు. 

16/21
హైదరాబాద్‌లోని  లుంబినీ పార్కులోని జలపాతంలో నీరు మురికిగా ఉన్నాయి. అయినా నిర్వాహకులు వాటిని మార్చలేదు. శుక్రవారం సందర్శనకు వచ్చిన చిన్నారులు ఆ నీటిలోనే ఆడుకున్నారు.

17/21
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌ గ్రామంలోని సహదేవి సముద్రం చెరువులో  20 కిలోల  భారీ మీనం మత్స్యకారుల వలకు చిక్కింది. ఇరవై కిలోల బరువున్న చేపలు ఎక్కువ సంఖ్యలో వలకు చిక్కడంతో మత్స్యకారులు సంబరపడ్డారు. 

18/21
ఏలూరు జిల్లా కైకలూరులోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో తెల్ల కాకి కనిపించింది. స్థానికులు ఆసక్తిగా, ఆశ్చర్యంగా తిలకించారు. తెల్లగా ఉండటానికి.. మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం తగ్గుదల, జన్యులోపాలే కారణమని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలోని జంతుశాస్త్ర అధ్యాపకులు కె.బాబు తెలిపారు. 

19/21
మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా ఏడో బ్లాక్‌ వద్ద ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బుంగ, మరికొన్ని చిన్న చిన్నవి కనిపించగా పూడ్చివేశారు.

20/21
పచ్చిరొట్ట విత్తనాల కోసం కామారెడ్డి జిల్లాలోని ఆరుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు ఎండను సైతం లెక్కచేయకుండా వరుసలో నిలబడ్డారు. కొందరు రైతులు మండే ఎండకు నిలబడలేక వరుసలో కాగితాలు, రాళ్లను ఉంచారు. 

21/21
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ ఈమధ్య ప్రయాణికులకు కాకుండా సరకు రవాణా చేరవేతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్లాట్‌ఫాంలు అన్నీ ఇలా సామగ్రితో నిండిపోయి కనిపించాయి.

మరిన్ని