News in pics: చిత్రం చెప్పే విశేషాలు (22-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 22 May 2024 11:00 IST
1/14
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఉదయం  రేవంత్‌ రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకల  మొక్కు చెల్లించారు. అనంతరం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం రేవంత్‌ రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
2/14
ఆకాశంలో నీలి మేఘాలు కమ్ముకున్న వేళ... చల్లటి గాలులు తనువును మీటుతున్న సమయాన... గోదావరి ఒడ్డు కనువిందు చేసింది. తూర్పుగోదావరి జిల్లా కుక్కునూరు మండలం వింజరం ఓడరేవు వద్ద కనువిందు చేసిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

3/14
ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కరీంనగర్‌ మానేరు జలాశయం.  సూర్యకిరణాలు జలాశయంపై పడినప్పుడు.. ఇలా వెండి పరిచినట్లు చూపరులకు కనువిందు చేసింది. వెండి వెలుగులో మత్స్యకారులు చేపలు పట్టడం.. మానేరంతా వెండి కప్పి వేసిందా? అనే దృశ్యాలు అందరిని కట్టిపడేశాయి.

4/14
వచ్చే జూన్‌ 2కు తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా  ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి  భేటీ అయ్యారు.

5/14
మత్తడివాగు ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్ర ప్రధాన రహదారికి అనుకొని ఉండటంతో చూపరులను ఆకట్టుకుంటూ నిండుకుండను తలపిస్తుండేది. ప్రస్తుతం జలాశయంలో నీరు లేక అడుగంటిపోయింది.  2008లో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఎప్పుడూ ఇలా చూడలేదంటున్నారు రైతులు. 

6/14
ట్రాక్టర్‌ ఇంజిన్‌పై ఎంచక్కా కూర్చొని ఓ కొండముచ్చు స్టీరింగ్‌ పట్టుకుందిలా.. మధిర మండలం చిలుకూరు గ్రామంలో కోతులను పారదోలేందుకు ఒకరు కొండముచ్చును కాపలాగా పెట్టారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద నిలిపిన ట్రాక్టర్‌కు దాన్ని కట్టేయగా సీట్లో కూర్చుని స్టీరింగ్‌ను పట్టుకుంది.

7/14
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట-బుట్టాయిగూడెం మండలాల సరిహద్దులోని గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలోని కొండపైన చక్కని జలపాతం ఉంది. ఇది నడివేసవిలో భక్తులకు ఎనలేని సాంత్వనను అందిస్తోంది.

8/14
వరంగల్‌ జిల్లా పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ దేశాల కరెన్సీ నోట్లతో మాలలు తయారు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.

9/14
ఎండ తీవ్రతకు సతమతమవుతున్న మూగజీవులు నీడ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయి. కరీంనగర్‌ నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని చెట్ల మధ్య కొండముచ్చులు తిరుగుతూ భవన కిటికీల పక్కన ఇలా సేదతీరుతున్నాయి.

10/14
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో ట్రక్‌ పార్కింగ్‌ మైదానంలో ఏర్పాటుచేసిన అండర్‌ వాటర్‌ టన్నెల్‌ డబుల్‌ డెక్కర్‌ ఎగ్జిబిషన్‌లో జలకన్యల ప్రదర్శన ప్రారంభించారు. స్పెయిన్‌ నుంచి రప్పించిన జలకన్యలు వాటర్‌ టన్నెల్‌లో  విన్యాసాల చేసి ఆకట్టుకున్నారు.

11/14
ఇటీవల వర్షాలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఉన్న ఉక్కు వంతెనపై పేరుకుపోయిన వ్యర్థాలను, మట్టిని తొలగిస్తున్నారు. మళ్లీ వర్షం పడినప్పుడు నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు.  

12/14
 శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తెలంగాణ సీఎం బుధవారం ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లిస్తారు. 

13/14
ఇటీవల మూడు రోజుల పాటు వరుసగా కురిసిన వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అడపాదడపా కాస్త విరామం ఇవ్వడంతో వానకు తడిచిన పాత పుస్తకాలను రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌లో ఓ చిరు వ్యాపారి ఇలా రహదారిపై ఆరబెట్టారు.

14/14
పచ్చదనంతో ఉట్టి పడుతూ కోనసీమ అందాలతో పోటీ పడుతున్న ఈ ప్రాంతం హైదరాబాద్‌లోనిదే. ట్యాంక్‌బండ్‌ చుట్టూ ఏపుగా పెరిగిన వృక్షాలు నగరానికి సరికొత్త అందాలను తీసుకొస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో  మరింత  ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి.

మరిన్ని